ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకి ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇందులో నలుగురి కుర్రాళ్ల పాత్రలకు ప్రేక్షకులంతా కనెక్ట్ అయ్యారు. మళ్లీ ‘ఈ నగరానికి ఏమైంది 2’ చిత్రంలో నలుగురు కుర్రాళ్లు రాబోతోన్నారు. ఈ సారి నలుగురి కుర్రాళ్లలో శ్రీనాథ్ మాగంటి కనిపించబోతోన్నారు. కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి అందరినీ ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. ENE2 చిత్రాన్ని నవంబర్ 19న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే మళ్లీ ఆ నాలుగు పాత్రలు హైలెట్ అవబోతోన్నాయని అర్థం అవుతోంది.

విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ ఎప్పటిలానే తమ టైమింగ్‌తో ఆకట్టుకున్నారనిపిస్తోంది. ఇక ఆ గ్యాంగులో కొత్తగా చేరిన శ్రీనాథ్ సైతం అదరగొట్టేశాడు. ఆల్రెడీ ఆడియెన్స్‌లో రిజిష్టర్ అయిన పాత్రలో మెప్పించడం అంటే అంత సాధారణ విషయం కాదు. అయితే ఈ ట్రైలర్‌ను చూస్తే శ్రీనాథ్ ఈ కార్తిక్ పాత్రలో ఒదిగిపోయాడనిపిస్తోంది. ఆ గ్యాంగ్‌లో ఒకడిగా కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది.

ట్రైలర్‌లో కార్తీక్‌గా శ్రీనాథ్ కామెడీ టైమింగ్, లుక్, ప్రజెన్స్ అన్నీ ప్రత్యేకంగా నిలిచాయి. అతను తన పాత్రలోని భావాన్ని అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ పాత్ర ఒక పట్టణ యువకుడు, సంప్రదాయ వృత్తిపరమైన ఎదుగుదల కంటే తన అభిరుచిని ఎంచుకోవడం వల్ల ఎదురయ్యే కాన్ ఫ్లిక్ట్స్ మధ్య నలిగిపోతుంటాడు. ఈ పరిణితిని ఆ గ్యాంగ్‌లోని స్వేచ్ఛాయుతమైన స్నేహబంధంతో సమతుల్యం చేయడం అంత సులభమైన పని కాదు. ఈ సీక్వెల్‌లో కార్తిక్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నాడు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus