నానిలో నటుడు కనిపించడు : అవసరాల శ్రీనివాస్

Advertisement

అష్టా – చమ్మా చిత్రం ద్వారా నానిని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఎనిమిదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా జెంటిల్ మన్. ఇందులో నాని విభిన్నంగా కనిపించనున్నాడు. అష్టా – చమ్మాలో సెకండ్ హీరోగా చేసిన అవసరాల శ్రీనివాస్ జెంటిల్ మన్ లో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమంలో బిజీ అయ్యారు. ఓ ఇంటర్వ్యూ లో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ “నాని ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో సినిమాలో నటించాడు. హీరోగా ఎదిగాడు. అయినా నాకు నాని లో నటుడు కనిపించడు. అతనిలో నాకు ఫ్రెండ్ మాత్రమే కనిపిస్తాడు.” అని చెప్పాడు.

శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ జెంటిల్ మన్ చిత్రాన్నినిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. సంగీత బ్రహ్మ మణిశర్మ చాలా గ్యాప్ తర్వాత మంచి మ్యూజిక్ ఇచ్చారు. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమ గాధ విజయాలతో దూసుకుపోతున్న నాని జెంటిల్ మన్ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తాడని సినీ పండితులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus