Srinu Vaitla, Gopichand: గోపీచంద్‌ – శ్రీను వైట్ల సినిమా ఓకే అయ్యిందా?

  • October 4, 2022 / 12:56 PM IST

అది శ్రీను వైట్ల సినిమా.. ఇలా బ్రాండ్‌ స్థాయిలో చెప్పుకునేవారు. అంతలా ఆయన సినిమాలకు పేరు ఉండేది ఇండస్ట్రీలో. శ్రీను వైట్ల కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌, పంచ్‌లు ఆ రేంజ్‌లో ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. పట్టిందల్లా బంగారం అన్నట్లు, చేసిందల్లా హిట్‌ అనుకునే పరిస్థితి లేదు. కెరీర్‌లో చాలా డీప్‌డౌన్‌లో ఉన్నారు శ్రీను వైట్ల. దీని నుండి బయట పడటానికి ఆయన చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు బాగా అచ్చొచ్చిన జోనర్‌ దాటి బయటకు వస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది.

మరీ శ్రీను వైట్లలా కాకపోయినా.. ఇండస్ట్రీలో సరైన హిట్‌ లేకుండా ఉన్న హీరో గోపీచంద్‌. వరుసగా సినిమాలు చేస్తున్నా సరైన విజయం పడటం లేదు. ఈ ఇద్దరూ కలసి ఇప్పుడు ఓ సినిమా చేయబోతున్నారు అనే టాక్‌ నడుస్తోంది. ఈ సినిమాకు కథ అందించేది కూడా విజయం కోసం చాన్నాళ్లుగా వెయిట్‌ చేస్తున్న రచయిత కమ్‌ దర్శకుడు బీవీఎస్‌ రవి. అలా ఈ ముగ్గురు కలయికలో సినిమా మెటీరియలైజ్‌ అవుతోంది అని టాక్‌ నడుస్తోంది.

బీవీఎస్‌ రవి, గోపీచంద్ గతంలో ఓ సినిమా చేశారు. రవి తొలిసారి మెగా ఫోన్‌ పట్టుకున్నది ఆ సినిమాతోనే. అదే ‘వాంటెడ్‌’. ఆ సినిమా సరైన ఫలితం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కథ అందిస్తున్న ఈ సినిమా ఫలితం ముగ్గురికీ చాలా కీలకం అనే చెప్పాలి. మరోవైపు శ్రీను వైట్ల కామెడీకి దూరంగా ఈ సినిమా చేస్తున్నారని కూడా అంటున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా కొత్త సినిమా కథ సిద్ధం చేస్తున్నారట.

ముందుగా చెప్పినట్లు శ్రీ‌ను వైట్ల బ‌లం కామెడీ. సినిమా ఫ్లాప్ అయినా ఎంట‌ర్‌టైన్‌మెంట్ బాగుంటుంది కూడా. లాజిక్కులు చూడకుండా హాయిగా సినిమాలోని కామెడీ చూసి న‌వ్వుకోవొచ్చు. అలాంటిది ఇప్పుడు తన జోనర్‌ నుండి ఎందుకు బయటకు వస్తున్నారో తెలియాలి. అయితే విజయం కోసం చేసే ఈ ప్రయత్నం సక్సెస్‌ అయ్యి.. ఆయన మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాలి. పనిలోపనిగా గోపీచంద్‌, బీవీఎస్‌ రవికి కూడా మంచి సినిమా పడాలి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus