Sriya Reddy: పవన్ సినిమాపై శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. అద్భుతమైన మూవీ అంటూ?

Advertisement

సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో నిలవడంతో శ్రియారెడ్డి పేరు మారుమ్రోగుతోంది. రాధారమా మన్నార్ పాత్రలో శ్రియారెడ్డిని తప్ప ఎవరినీ ఊహించుకోలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు ప్రాణం పోసే అతికొద్ది మంది నటీమణులలో శ్రియారెడ్డి ఒకరు కావడం గమనార్హం. పవన్ సినిమాపై శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఓజీ అద్భుతమైన మూవీ అని సుజీత్ అదిరిపోయే కథ రాశారని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ ను కలిసే వరకు ఆయన అంత పెద్ద స్టార్ అనే విషయం నాకు తెలియదని ఆమె పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ను నేను ఎప్పుడూ ఊహించలేదని శ్రియారెడ్డి అన్నారు. ఓజీ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నానని ప్రకటించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా మీరు మా దేవుడితో కలిసి వర్క్ చేస్తున్నారు కదా అని అన్నారని శ్రియారెడ్డి అన్నారు.

పవన్ కళ్యాణ్ మనస్సు చాలా మంచిదని పవన్ తో కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని శ్రియారెడ్డి అభిప్రాయపడ్డారు. ఓజీ సినిమాలో భాగమైనందుకు సంతోషిస్తున్నానని ఓజీ మూవీలో నా రోల్ నెగిటివ్ రోల్ కాదని శ్రియారెడ్డి చెప్పుకొచ్చారు. ఓజీ సినిమాలోని నా పాత్రలో ఎన్నో షేడ్స్ ఉంటాయని ఆమె కామెంట్లు చేశారు. అభిమానులతో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఎదురుచూస్తున్నానని శ్రియారెడ్డి వెల్లడించారు.

ఓజీ మూవీ అద్భుతమైన మూవీ అంటూ శ్రియారెడ్డి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఓజీ మూవీ దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఓజీ మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus