చదువు పూర్తయ్యాకే సినిమా!

ఇటీవల షారుఖ్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌, ఐశ్వర్యరారు కుమార్తె ఆరాధ్య కలసి ఓ సినిమాలో నటిస్తారని వార్తలు వినిపించాయి. ఓ పార్టీలో షారుక్‌, ఐసూ వీటిపై సరదాగా కామెంట్స్‌ కూడా చేసుకున్నారు. ఇటీవల మళ్లీ షారుఖ్‌ పిల్లలు వార్తల్లోకొచ్చారు.

షారుఖ్‌ స్నేహితుడు కరణ్‌ జోహార్‌ ఆర్యన్‌తో ఓ సినిమా ప్రారంభించాలను కుంటున్నానని తన మనసులో మాటను చెప్పాట. దానికి షారుఖ్‌ స్పందిస్తూ వాళ్లు సినిమా రంగాన్ని ఎంచుకుంటే భవిష్యత్తులో ఆ రంగానికే వస్తారు. కానీ ఇప్పటికిప్పుడే సినిమాలోకి తీసుకురావ డం ఇష్టం లేదని స్పష్టం చేశాడు. ఇంకా చెబుతూ ” నేను చదువును నమ్మిన గొప్ప వ్యక్తిని. అందువల్ల మా పిల్లలు మొదట చదువు పూర్తి చేయాలి. ఆర్యన్‌ గ్రాడ్యుయేట్‌ చేయాలి. ఇప్పుడు వాడు ఇంటర్మీడియేట్‌ చేస్తున్నాడు. మరో నాలుగేళ్లు ఉంటే తన కాలేజీ పూర్తవుతుంది. సుహాన స్కూల్‌లో చదువుతోంది. తను ఇంకా రేండేళ్లు పాఠశాలలోనూ, మరో నాలుగేళ్లు కాలేజీలోనూ చదవాలి. ఎవరికై కనీసం డిగ్రీ చదవడం అన్నది అవసరం” అని అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags