ఈ రోజుల్లో కంటెంట్ ఉన్న సినిమాలకు భారీ ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల అభిరుచికి తగిన కంటెంట్‌తో వచ్చే సినిమాలు గొప్ప విజయం సాధిస్తున్నాయి. స్టార్ నటీనటులు నటించకపోయినా కథలో బలం ఉండాలే గానీ ఆ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. కొత్త దర్శకనిర్మాతలు సైతం అలాంటి కథలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే 1134 అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి.
రాబరీ థ్రిల్లర్‌గా మునుపెన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని ఈ 1134 రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు శరత్ చంద్ర తడిమేటి. తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్ని వర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం కూడా ఎంతో థ్రిల్ చేసేలా షూట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో బాగా చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 1134 అనే డిఫరెంట్ టైటిల్‌కి తగ్గట్టుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. నడిరోడ్డుపై డబ్బుల బ్యాగ్, ఆ వెనుక ముగ్గురు వ్యక్తుల షాడోతో కూడిన ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు బోలెడన్ని ఉంటాయని స్పష్టమవుతోంది.
రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రానికి శరత్ చంద్ర తడిమేటి దర్శకత్వం వహిస్తున్నారు. గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మదుపు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి సంగీతం అందిస్తున్నారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!