Kriti, Prabhas: ప్రభాస్‌నీ బాలీవుడ్‌ని హీరోగా మార్చేస్తున్నారా?

  • November 28, 2022 / 01:03 PM IST

కృతి సనన్‌ మనసులో ప్రభాస్‌ ఉన్నాడు.. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మొన్నీమధ్య కృతి సనన్‌ ఓపెన్‌గానే చెప్పింది. ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. అయితే ఇప్పుడు దానికి ఎక్స్‌టెండెడ్‌ స్టేట్‌మెంట్‌ ఒకటి వచ్చింది. అదే ప్రభాస్‌ మనసులో కృతి ఉందట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. కృతి స్నేహితుడు, ఆమె సహ నటుడు, బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌. ఈ ఇద్దరూ ఓ ఓటీటీ షోకి రాగా.. అక్కడ మాటల్లో భాగంగా ప్రభాస్‌ – కృతి చర్చ వచ్చింది.

హోస్ట్‌ కరణ్‌ జోహర్‌తో మాట్లాడుతూ.. ‘కృతి పేరు మరొకరి హృదయంలో ఉంది’ అని వరుణ్‌ ధావన్‌ అన్నాడు. దానికి కరణ్‌ ‘ఎవరి హృదయం అది?’ అని అడిగాడు. ‘ప్రస్తుతం ముంబయిలో లేని ఓ వ్యక్తి మనసులో కృతి పేరు ఉంది. అతను ప్రస్తుతం దీపిక పడుకొణెతో ఓ సినిమాలో నటిస్తున్నాడు’ అని వరుణ్‌ చెప్పాడు. దీంతో అతనెవరు అనే విషయం చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. దీంతో ఇప్పుడు ఆ మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే ప్రభాస్ మీద ఎఫైర్ రూమర్స్ కొత్తేమీ కాదు. గతంలో కొంతమంది హీరోయిన్స్‌తో ఆయనకు అనుబంధం ఉందని వార్తలొచ్చాయి. అందులో ఎక్కువగా అనుష్క శెట్టి పేరు వినిపించింది. పెళ్లి కూడా చేసుకుంటారూ.. అంటూ వార్తలొచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు ఇద్దరూ ఖండిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ‘కృతితో ప్రభాస్‌’ అనే కాన్సెప్ట్‌ను ఎంతవరకు నమ్మొచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. అయితే ఇక్కడే ఓ విషయం మనం గమనించాలి.

బాలీవుడ్‌లో ఇలాంటి ఆర్టిఫిషియల్‌ కమ్‌ వన్‌ మూవీ రిలేషన్ షిప్స్‌ కామన్‌. ఇద్దరు కలసి ఓ సినిమా చేశారు అంటే.. ఇద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు బయటకు తీసుకొస్తారు. దానికి ఆయా నటీనటులతో ‘ఉ’ అని అనిపిస్తారు. దాని వల్ల సినమాకు ప్రచారం అని ఫీల్‌ అవుతుంటారు. ఇప్పుడు ‘ఆదిపురుష్‌’ విషయంలోనూ అదే స్ట్రాటజీ వాడుతున్నారా అనే ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. అలా ప్రభాస్‌ను కూడా సగటు బాలీవుడ్‌ హీరోను చేసేస్తున్నారా అనేది ఇక్కడ పాయింట్‌.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus