బుల్లితెర నటి శ్వేతా తివారి తన సీరియల్స్ తో దేశమంతటా పాపులారిటీ దక్కించుకుంది. తాజాగా ఈ బ్యూటీ వివాదంలో చిక్కుకుంది. ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది శ్వేతా తివారి. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసింది. ఆ కామెంట్ ఏంటంటే..? ‘దేవుడు నా బ్రా సైజ్ కొలుస్తున్నాడు’. దీంతో ఆమెని అరెస్ట్ చేయాలంటూ యాక్టివిస్ట్ లు రంగంలోకి దిగారు.
ఈ విషయంలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇంతకీ ఆమె అలా అనడానికి కారణమేంటంటే..? ఆమె నటిస్తోన్న వెబ్ సిరీస్ ఫ్యాషన్ రంగం చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆమె మోడల్ గా నటిస్తోంది. సౌరబ్ జైన్ అనే నటుడు ‘బ్రా’ ఫిట్టర్ పాత్ర పోషిస్తున్నాడు. గతంలో ‘మహాభారతం’ టీవీ సీరియల్ లో సౌరబ్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు. దీంతో.. శ్వేతా దేవుడు(సౌరబ్) నా బ్రా సైజ్ కొలుస్తున్నాడని జోక్ చేసింది.
ఆమె మాట్లాడింది దేవుడు పాత్ర పోషించిన నటుడు గురించి. కానీ చాలా మందికి ఈ విషయం నచ్చలేదు. దీంతో ఆమెపై కేసులు పెట్టారు. దీనిపై స్పందించిన శ్వేతా.. తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. తన మాటలను వక్రీకరించారని పేర్కొంది. సహ నటుడు సౌరబ్ పాత్రను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ని దేవుడితో ముడిపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను దేవుడ్ని బాగా నమ్ముతానని.. తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి!
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!