Actress: ఈ ప్రముఖ నటి బోల్డ్ కామెంట్స్ వింటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కొంతమంది హీరోయిన్లు అభినయ ప్రధాన పాత్రలకు ఓటేస్తుండగా మరి కొందరు హీరోయిన్లు మాత్రం గ్లామరస్ రోల్స్ కు ఓటేస్తున్నారు. కొంతమంది హీరోయిన్లు బోల్డ్ రోల్స్ లో నటించడంతో పాటు బోల్డ్ కామెంట్స్ చేస్తూ అభిమానులను ఒకింత షాకిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి రేఖా నాయర్ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మహిళల డ్రెస్సుల గురించి అబ్బాయిల ప్రవర్తన గురించి మాట్లాడాలని యాంకర్ ప్రశ్నించగా రేఖా నాయర్ రెచ్చిపోయి తనదైన శైలిలో కామెంట్లు చేశారు. అమ్మాయిల నడుము మీద మగవాళ్ల చేతులు పడితే సంతోషించాలే తప్ప ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ఎవరైతే చీర కట్టుకుంటారో వాళ్ల నడుము కనిపిస్తుందని రేఖా నాయర్ కామెంట్లు చేయడం గమనార్హం. బస్ లో ట్రావెల్ చేసే సమయంలో ఎవరైనా నా తుంటిపై చెయ్యి వేస్తే నేను ఫీల్ కానని రేఖా నాయర్ పేర్కొన్నారు.

పోటీలలో పాల్గొనే సమయంలో, జాగింగ్ చేసే సమయంలో నడుము కనిపించే విధంగా డ్రెస్ వేసుకోవడం నాకు ఇష్టమని ఆమె కామెంట్లు చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో సీరియళ్ల ద్వారా ఈ నటి ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ నటి చేసిన కామెంట్లు వింటే నోరెళ్లబెట్టాల్సిందే అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలు బట్టలు వేసుకునే విధానాన్ని పొగిడేది అబ్బాయిలు మాత్రమేనని రేఖా నాయర్ పేర్కొన్నారు.

రేఖా నాయర్ (Actress) చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలలో చాలామంది ఆమె కామెంట్లను వ్యతిరేకిస్తున్నారు. వివాదాస్పద ఇంటర్వ్యూల ద్వారా రేఖా నాయర్ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. రేఖా నాయర్ తన ప్రవర్తనను మార్చుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రేఖా నాయర్ రాబోయే రోజుల్లో ఇతర ఇండస్ట్రీలపై కూడా దృష్టి పెడతారేమో చూడాలి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus