సంతానం కలగకపోతే సామాన్యులకు మాత్రమే కాదు సెలబ్రిటీలకైనా నరకంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ప్రమోట్ అవ్వడం అనేది ఎవ్వరికైనా గొప్ప భాగ్యమని చెప్పాలి. అయితే ఓ నటి 14 సార్లు తల్లి కావాలని ప్రయత్నించినా కాలేకపోయిందట. వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ నటి కాశ్మీర షా చాలా ఫేమస్. ఈమె హిందీలో మాత్రమే కాదు తెలుగు, తమిళ్, భోజపురి, మరాఠీ భాషల్లోని సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. అలాగే ‘బిగ్‌బాస్ 1’, ‘నాచ్ బలియే 3’, ‘ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ’ వంటి టీవీ షోలతో కూడా ఈమె వార్తల్లో నిలుస్తుంటుంది.
ఇక ఈమె (Actress) 2013లో నటుడు, టీవీ హోస్ట్ అయిన కృష్ణ అభిషేక్‌ను వివాహం చేసుకుంది. వీళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం.అందుకోసం 14 సార్లు ప్రయత్నించారట. కానీ పేరెంట్స్ గా ప్రమోట్ కాలేకపోయారట. అయితే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సలహా వల్ల వీళ్ళు పేరెంట్స్ అయ్యారట. ‘సరో గసీ’ పద్ధతి ద్వారా పిల్లలను ప్లాన్ చేసుకోమని కాశ్మీర షా దంపతులకి సల్మాన్ ఖాన్ సలహా ఇచ్చాడట. దాదాపు 4 ఏళ్ళ తర్వాత సరోగసీ ద్వారా ఈమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందట.
ఇప్పుడు వీళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారట. అందుకు కారణం.. ‘సల్మాన్ ఖానే అని.. ఆయన మంచి మనసున్న వ్యక్తి అని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని’ ఆమె చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో మాత్రం ఆమె సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కనడం పై ట్రోలింగ్ కూడా జరిగింది.