సొంత మేనమామే మమ్మల్ని వేధిస్తున్నాడు : నటి కామెంట్స్

  • September 14, 2019 / 12:16 PM IST

ఇలా మీటూ ఉద్యమం ముగిసిందిలే అని అనుకునే లోపు ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న వేధింపులను బయటపెడుతూ వస్తున్నారు కొందరు నటీమణులు. తమ పక్కలోకి రాకపోతే సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తామని కూడా బెదిరిస్తున్నట్లు వారు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కూడా ఓ నటి మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది. అయితే ఈసారి సినీ ఇండస్ట్రీ పై కాదు తన కుటుంభంలో వ్యక్తే తనని వేధిస్తున్నాడని ఆరోపణలు వ్యక్తం చేస్తుంది.

వివరాల్లోకి వెళితే… ప్రముఖ కన్నడ నటి, నృత్యకారిణి జయశ్రీ రామయ్య ఇటీవల పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. ‘ఆస్తి కోసం తన సొంత మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని’ జయశ్రీ సీకె అచ్చుకట్టె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.అటు తరువాత మీడియాతో కూడా ఆమె ముచ్చటించింది… ‘మా మావయ్య గిరీష్ ఆస్తి విషయమై.. చాలా కాలంగా నాతో పాటు నా తల్లిని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయమై ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి హనుమంత నగర్‌లో ఉన్న తమ ఇంటికి వచ్చి గొడవ చేసి నా తల్లిని ఇంటి నుండి బయటకు గెంటేశాడు. నా వస్త్రాధరణ పై కూడా అసభ్య పదజాలాలతో దూషించాడు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం పై విచారణకు హాజరు కావాలంటూ జయశ్రీతో పాటు గిరీశ్‌కు కూడా నోటీసులు అందాయి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus