తాజాగా ప్రియుడి పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఓ నటి వార్తల్లోకెక్కింది. వివరాల్లోకి వెళితే.. తమిళ సీరియల్ ఆర్టిస్ట్ అయిన జెన్నిఫర్.. మణలి అనే ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో నివసిస్తూ వస్తోంది.ఐదేళ్ల క్రితం ఈమెకు టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశం లభించింది. తరువాత అంటే.. 2019లో ఆగస్టు 25న శరవణన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలబడలేదు.మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. ఆ కేసు పై కోర్టులో ఇంకా విచారణ జరుగుతూనే ఉంది.
ఇదిలా ఉండగానే.. టీవీ సీరియల్స్‌కు సహాయ దర్శకుడిగా పని చేస్తున్న నవీన్ కుమార్ అనే వ్యక్తితో జెన్నిఫర్ కు పరిచయం ఏర్పడింది. తరువాత సహజీవనం మొదలుపెట్టే వరకూ వీరి బంధం వెళ్ళింది. అయితే గత ఏడాది కరోనా కారణంగా లాక్ డౌన్ ఏర్పడడంతో ఇతనికి మనీ షార్టేజ్ వచ్చింది.అప్పటి నుండీ డబ్బు కోసం జెన్నిఫర్ సాయం కోరడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల పాటు ఆమె భరించింది. కానీ అతను మాటిమాటికీ డబ్బులు అడుగుతూనే ఉంటున్నాడట.దీంతో ఆమె ఇగ్నోర్ చెయ్యడం మొదలుపెట్టింది.
ఓసారి ఈమె షూటింగ్లో ఉండగా.. అతను వచ్చి జెన్నిఫర్ ను కారులో బయటకి తీసుకువెళ్లాడట.ఆమెతో ప్రేమగా మాట్లాడుతూనే సీక్రెట్ గా ఆమెను నగ్నంగా వీడియో తీసాడట. ఇప్పుడు ఆ వీడియోతోనే ఈమెను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడట. ఈ విషయాన్ని జెన్నిఫర్.. నవీన్ కుమార్ తల్లికి చెప్పి.. అతన్ని మందలించమని అలాగే తనని ఇబ్బంది పెట్టొద్దని చెప్పమని కోరిందట. అయినప్పటికీ ఆమె కనికరించకుండా తన కొడుకు చెప్పినట్టే వినాలని తేల్చి చెప్పిందట. ఇక చేసేది ఏమీ లేక ఈమె చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది.