సినిమా అనేది రంగుల ప్రపంచం. దీంట్లో రాణించాలంటే కొన్నింటిని భరించాల్సిందే. చాలా కొద్ది మంది మాత్రమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైకి రాగలుగుతారు. ముఖ్యంగా హీరోయిన్ గా రాణించాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిందే. ఇండస్ట్రీలో హీరోయిన్స్‌తో మిస్ బిహేవ్ చేయడం వాడుకొని వదిలేయడం కామన్ అయిపోయింది. మమ్మల్ని అలా చేశారు.. ఇలా వాడుకున్నారంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ చాలా కాలానికి బయటపెడుతుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం సినిమాలో ఓ రొమాంటిక్ ఓ సీన్ చేయడానికి డైరెక్టర్స్ ని ముప్పు తిప్పలు పెట్టిందట.
అంతేకాదు ఆ సినిమా విడుదలై కొన్నేళ్లు అవుతున్న ఆ సీన్ చూస్తే కంపరంగా అనిపిస్తూ ఉంటుందట. ఆమె మరెవరో కాదు జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సదా. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. కాకాపోతే ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కోసం గట్టిగా ట్రై చేస్తోంది. ఇంకా అమ్మడికి సరైన ఛాన్స్ రాలేదు. ఈ క్రమంలోనే సదాకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.
జయం సినిమాలో రాను రానంటూనే చిన్నదో పాటతో కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది సదా. ఆ సినిమాలోని ఓ సీన్ లో హీరో నితిన్ – విలన్ గోపీచంద్ మధ్య నలిగిపోతుంది ఈ అమ్మడు. నితిన్ కలుసుకోవడానికి ఆమె గుడిలో ప్రదిక్షణలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు తెలియకుండా నితిన్ కలుస్తుంది. అప్పుడే ఆ విషయాన్ని కనిపెట్టిన గోపీచంద్ ముందుగానే అక్కడికి చేరుకుని వారిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంటాడు. ఆ సమయంలో గోపీచంద్ సదాను (Actress) నాలికతో చెంపపై నాకుతాడు.
ఆ సీన్ టైంలోనే సదా చాలా ఇబ్బంది పడిందట. నేను చేయను అంటే చెయ్యను.. కావాలంటే నన్ను సినిమాలోనుంచి తీసేయండి అంటూ ప్రాధేయపడిందట. కానీ డైరెక్టర్ తేజ మాత్రం సదా మాటను అస్సలు వినలేదట. నువ్వు ఈ సీన్ చేస్తేనే సినిమాకు హైలెట్ అవుతుంది అంటూ బలవంతం చేశాడట. ఆఖరికి గోపీచంద్ కూడా వద్దులేండి సార్ అంటే ఆయనపై కూడా నీకు తెలియదులే అంటూ కోపపడ్డాడట.
అక్కడ ఉండేవారు సర్ధి చెప్పడంతో అతి కష్టం మీదే ఆమె ఆ సీన్ కి ఒప్పుకునేందట. ఆ సీన్ అయిన తర్వాత ఏకంగా పదిసార్లకు పైగా తన ముఖం కడుక్కుని ఇంటికి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చిందట. ఇప్పటికీ టీవీలో ఆ సీన్ చూస్తే ఆమె తెగ ఫీల్ అయిపోతుందట.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!