కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని చోట్లా ఉంది కానీ సినిమా ఫీల్డ్‌లో దీని ప్రభావం ఎక్కువే.. ధైర్యం చేసి నోరు విప్పి అందరూ కలిసి కట్టుగా బయటకొచ్చి ‘మీటూ’ అనే ఉద్యమం స్టార్ట్ చేసి ప్రపంచ సినీ చరిత్రలో సంచలనం సృష్టించారు హాలీవుడ్ నటీమణులు.. తగ్గేదే లే అన్నట్టు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పి.. పట్టు విడువకుండా పోరాడి.. తమను చిత్ర హింసలకు గురి చేసిన వారికి శిక్ష పడేలా చేశారు.. తర్వాత ఇండియాను కూడా షేక్ చేసిందీ ఇన్సిడెంట్..
కాలం మారుతున్నా మహిళల పట్ల మగాళ్ల ఆలోచనా ధోరణి మారడం లేదు.. అప్పటి సీనియర్ నటీమణులతో పాటు ఇప్పటి వారు కూడా సమయం వచ్చినప్పుడు వారికి జరిగిన ఇటువంటి సంఘటనల గురించి నోరు విప్పుతున్నారు.. తాజాగా మరో నటి ఈ లిస్టులో చేరారు.. ఓకంగా హీరోయిన్ ఆఫర్ ఇచ్చి.. కొంతమందికి అడిగినప్పుడల్లా కమిట్మెంట్ ఇస్తూ ఉంటే నీ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అంటూ ఓ డైరెక్ట్ చెప్పడం తనను అవమానానికి గురి చేసిందంటూ కెరీర్ మొదట్లో జరిగిన ఓ ఉదంతం గురించి చెప్పుకొచ్చారామె.. వివరాల్లోకి వెళ్తే..
జీవిత.. తమిళ్లో పాపులర్ సీరియల్ యాక్ట్రెస్.. ఆమె పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడి కథానాయికగా అవకాశం ఇచ్చాడట.. ఓపెనింగే హీరోయిన్ అవకాశం రావడంతో ఆమె ఆనందానికి అవధేల్లేవు.. కట్ చేస్తే అక్కడే డైరెక్టర్ ఓ మెలిక పెట్టాడట.. నీకు మంచి క్యారెక్టర్, డబ్బుతో పాటు భవిష్యత్తుకి ఢోకా లేకుండా చూసుకుంటాను.. కాకపోతే నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పాడట..
జీవిత మాట్లాడుతూ..‘‘ ఆ డైరెక్టర్.. నువ్వు.. నిర్మాత, మేనేజర్, కెమెరామెన్తో కలిసి ఉండాలి.. వారు నీ గదికి ఎప్పుడైనా వస్తారు.. వారిని సంతోషపెట్టాలి.. అన్నాడు.. అతడి మాటల్లోని ఉద్దేశం నాకు పూర్తిగా అర్థం అవ్వడంతో.. భయంతో ఏడ్చాను.. ఆ నిమిషం నేను ఎంత దారుణంగా అవమానించబడ్డానో.. ఎంతలా కించపరచబడ్డానో అర్థమైంది.. మీ చెత్త ఆఫర్ నాకు అవసరం లేదని అక్కడ నుంచి వచ్చేశాను.. కానీ ఆ అవమానాన్ని చాలా రోజుల పాటు మర్చిపోలేక పోయాను’’ అని చెప్పుకొచ్చారు..