సుచిత్రా కృష్ణమూర్తి… ఈమె తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఈమె తెలుగు ఫ్యామిలీకి చెందిన మహిళే. 1991వ సంవత్సరంలో మలయాళంలో రూపొందిన ‘కిలుక్కింపెట్టి’ తో ఈమె తెరంగేట్రం చేసింది. ఆ చిత్రంలో ఈమె జయరామ్ కు జోడీగా నటించింది.అటు తర్వాత తమిళంలో కూడా ‘శివరంజని’ అనే చిత్రంలో లీడ్ రోల్ లో మెరిసింది. తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన ‘జజ్బాత్ ఆగ్’ ‘కభీ హా కభీ నా’ ‘రోమియో అక్బర్ వాల్టర్’ చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకుంది.
నిజానికి ఈమె సింగర్ కావాలని అనుకుంది. చిన్నప్పటి నుండీ ఆమె కలగన్నది దానికోసమే. అయితే నటిగా మారిన తర్వాత సింగర్ గా కూడా పలు సినిమాల్లో పాటలు ఆలపించింది. ఇటీవల వచ్చిన ‘భూల్ భులయా 2’, ‘గిల్టీ మైండ్స్’ (వెబ్ సిరీస్) లో ఈమె నటించింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుచిత్రా కృష్ణమూర్తి తన కూతురు గురించి చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.గతంలో ఈమె శేఖర్ కపూర్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
కానీ ఎనిమిదేళ్లకే ఈమె మనస్పర్థల కారణంగా అతనితో విడిపోయింది.1999 లో పెళ్లి చేసుకున్న ఈమె 2007లో విడాకులు తీసుకుంది. ఈమెకు కావేరి కపూర్ అనే పాప కూడా ఉంది. ‘నేను విడాకులు తీసుకున్న తర్వాత నా కూతురు నా పేరుని డేటింగ్ సైట్లో ఎంటర్ చేసింది. డేటింగ్ చేయమని బలవంతం చేసింది.నేను ఎవరికీ తెలియని ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నానని, తర్వాత అతనితో కూడా విడిపోయానని, నేను డేటింగ్ చేసేందుకు మాత్రమే ఉన్నానా? అంటూ నా కూతురికి అర్థమయ్యేలా వివరించాను.
అటు తర్వాత నాకు అసభ్యకరంగా మెసేజ్‌లు రావడంతో డేటింగ్ సైట్ నుండీ నా ప్రొఫైల్‌ను తొలగించాను’ అంటూ సుచిత్రా కృష్ణమూర్తి పేర్కొంది.ఇక్కడ తన తల్లి ఒంటరిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే సుచిత్రా పేరుని ఆమె కూతురు డేటింగ్ సైట్ లో ఎంటర్ చేసిందట. ఇక కావేరి ‘అవర్ లవ్ స్టోరీ’తో నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!