హీరోయిన్లు అందంగా కనిపించడానికి రూ.9 వేలు పెట్టి ఓ ఇంజెక్షన్ చేయించుకుంటారట. ఈ విషయాన్ని ఓ నటి బయటపెట్టింది. ఆమె మరెవరో కాదు ఈషా గుప్తా. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ఈమె తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ భామ పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు అన్నీ ఇన్నీ కావు. ఆమె ఫోటోలకి ఇచ్చే ఫోజులు రెట్టింపు మోతాదులో ఉంటాయి. తెలుగులో రాంచరణ్- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ‘ఏక్ బార్’ సాంగ్ లో చిందులేసింది ఈ బ్యూటీ.
ఇక తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఈషా గుప్తా మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో నేను ఎన్నో మాటలు పడ్డాను. నాకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. నా ముక్కు గుండ్రంగా ఉందని, దాన్ని షార్ప్‌గా కనిపించేలా చేసుకోమని కొందరు అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నా స్కిన్ మెరిసిపోయేందుకు ఇంజక్షన్ తీసుకోమని కూడా సలహాలు ఇచ్చారు. వాళ్ల సలహా మేరకు నేను ఆ ఇంజెక్షన్ గురించి ఆరా తీయగా…
అది రూ.9000 వరకు ఉంటుందని తెలిసింది. దాని పేరు నేను చెప్పలేను కానీ చాలామంది నటీమణులు ఫెయిర్ స్కిన్ కోసం ఆ ఇంజెక్షన్ ను వాడుతూ ఉంటారు. అందంగా కనిపించాలని నటీమణులు పై చాలా ఒత్తిడి ఉంటుంది. నేను నా కూతురిని నటిగా మాత్రం చూడాలనుకోవడం లేదు. ఆమె పెద్దగా చదువుకోకపోయినా పర్వాలేదు, కానీ నటిని మాత్రం చేయాలని నేను అనుకోవడం లేదు’ అంటూ ఈమె చెప్పుకొచ్చింది. కాగా ఈషా గుప్తా వయసు ఇప్పుడు 36 సంవత్సరాలు కావడం గమనార్హం.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!