కరోనా మొదలైనప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక రీసెంట్ గా కత్రినా కైఫ్, అలియాభట్ లాంటి స్టార్ హీరోయిన్లు తము ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ లీస్ట్ లోకి పవన్ కళ్యాణ్ హీరోయిన్ కూడా చేరబోతోంది. ఆమె పేరు నికీషా పటేల్. పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమరం పులి’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది నికీషా. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో నికీషాకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
తమిళ, కన్నడ సినిమాలు కూడా ట్రై చేసింది. అక్కడ కూడా ఆమెకు ఛాన్సులు అంతంతమాత్రంగానే వచ్చాయి. దీంతో తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆ తరువాత లండన్ కు వెళ్లిపోయింది. అక్కడ తనకు నచ్చిన వర్క్ చేసుకుంటూ గడుపుతోంది. వెండితెరకు దూరమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో అభిమానులతో చాట్ చేస్తుంటుంది. హీరోల పుట్టినరోజులు శుభాకాంక్షలు చెబుతుంటుంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని ప్రశ్నించాడు.
దానికి ఆమె.. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి బ్రిటన్ లోనే ఉన్నాడని సమాధానమిచ్చింది. త్వరలోనే తను పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేసింది. ఇన్నాళ్లకు తనకు కావాల్సిన వ్యక్తి దొరికాడని.. బ్రిటన్ లో అతడిని వెతికి పెట్టుకున్నానని చెప్పింది. త్వరలోనే అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే అతడు ఇండియాకు చెందిన వ్యక్తా..? లేక బ్రిటీషరా..? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి నికీషా డేటింగ్ లో ఉన్న విషయాన్ని బయటపెట్టింది.