కొత్త సినిమా ఓకే అవ్వడం వెనుక ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరోయిన్‌

ఇప్పుడు అంటే టాలీవుడ్‌లో ఓ స్టార్‌ హీరో సినిమా తెరకెక్కుతోంది అంటే వినిపించే బాలీవుడ్‌ హీరోయిన్‌ పేర్లలో ఆలియా భట్‌ (Alia Bhatt) , జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఉన్నాయి. ఒకప్పుడు అయితే ఇలాంటి పరిస్థితుల్లో వినిపించే ఏకైక పేరు పరిణీతి చోప్రా. ఆమె పేరు లేదంటే ఎవరో కొత్త అమ్మాయి పేరు వినిపించేది. అంతలా పరిణీతి చోప్రా పేరు మనకు అలవాటు అయిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలీవుడ్‌లో టైర్‌ 1 స్టార్ హీరోయిన్‌ అవ్వలేకపోయింది పరిణీతి.

ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇటు నాయికగా, అటు భార్యగా లైఫ్‌ లీడ్‌ చేస్తోంది. తాజాగా, ఆమె గురించి ఓ ఆసక్తికర విషయం ఒకటి తెలిసింది. అంటే తెలిసింది అనే కన్నా ఆమే చెప్పింది అని అనొచ్చు. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ‘అమర్‌ సింగ్‌ చమ్కీలా’ సినిమా కోసం సింగింగ్‌ ఆడిషన్‌ ఇచ్చాను అంటూ ఆ సినిమా వెనుక ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయం చెప్పింది పరిణీతి చోప్రా. దిల్జీత్‌ దోసాంజ్‌ కథానాయుడిగా తెరకెక్కిన చిత్రమిది.

ఈ సినిమాలో పరిణీతి కథానాయిక పాత్ర పోషించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న పరిణీతి తనకి ఈ సినిమాలో పాటలు పాడే అవకాశం ఎలా వచ్చిందో తెలిపింది. రెండేళ్ల క్రితం కరణ్‌ జోహార్‌ పుట్టినరోజు వేడుకకు పరిణీతి చోప్రా వెళ్తున్న సమయంలో దర్శకుడు ఇంతియాజ్‌ అలీ ఫోన్‌ చేశారట. దిల్జీజ్‌, రెహమాన్‌ జూమ్‌ కాల్‌లో ఉన్నారు. నీతో ఇప్పుడు మాట్లాడొచ్చా అని అడిగారట. ట్రాఫిక్‌లో ఉన్నాను అని చెప్పి… కాల్‌ మాట్లాడిందట.

అప్పుడు మీకు పాటలు పాడటం తెలుసా అని ఏఆర్‌ రెహమాన్‌ అడిగారట. పాడటం అంటే ఇష్టమని చెప్పిన ఆమె… అప్పుడే ‘దమా దమ్‌ మస్త్‌ కలందర్‌…’ అనే పాటన పాడమని అడిగితే పాడేసిందట. అలా ఆ సినిమాలో హీరోయిన్‌గానే కాదు.. గాయనిగాను భాగమైంది పరిణీతి చోప్రా. ఇక ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. ఏప్రిల్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమ్‌ అవ్వనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus