సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. కొంతమంది ఈ వార్తలు నిజమని నమ్మితే మరి కొందరు మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని చెబుతారు. అయితే నటి జెన్నీఫర్ మిస్త్రీ తాజాగా ఒక నిర్మాత గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిర్మాత అసిత్ మోడీ గురించి ఈ నటి ఈ కామెంట్లు చేశారు.
అసిత్ మోడీ తన రూమ్ కు వచ్చి విస్కీ తాగాలని రెండుసార్లు ఆఫర్ చేశాడని (Actress) ఆమె చెప్పుకొచ్చారు. తాను ఆ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేశానని జెన్నీఫర్ మిస్త్రీ తెలిపారు. పాపులర్ సిట్ కామ్ అయిన తారక్ మెహతా కా ఊల్టా ఛష్మా షోలో రోహన్ సోధి రోల్ లో నటించి ఈ నటి మెప్పించారు. నిర్మాత లైంగిక వేధింపుల వల్లే ఆ షో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు.
వేర్వేరు సందర్భాలలో సైతం అసిత్ మోడీ విస్కీ తాగడానికి తన గదికి రావాలని కోరాడని ఆమె చెప్పుకొచ్చారు. 2019 సంవత్సరంలో మా టీమ్ మొత్తం సింగపూర్ కు వెళ్లిందని జెన్నీఫర్ మిస్త్రీ అన్నారు. ఆ సమయంలో పరిస్థితులు మారిపోయాయని ఆమె చెప్పుకొచ్చారు. రాత్రి సమయంలో నీకు భాగస్వామి లేకపోతే నా దగ్గరికి వచ్చి విస్కీ తాగాలని అసిత్ మోడీ కోరారని జెన్నీఫర్ మిస్త్రీ పేర్కొన్నారు.
ఆయన అలా చెప్పడంతో నేను ఆశ్చర్యానికి గురయ్యానని ఆమె తెలిపారు. ఆ తర్వాత రోజు ఆయన నా అందాన్ని పొగిడారని జెన్నీఫర్ మిస్త్రీ పేర్కొన్నారు. మిమ్మల్ని చూస్తే గట్టిగా ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. జెన్నీఫర్ మిస్త్రీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి అసిత్ మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.