రవిబాబు తనని లైంగికంగా వేదిస్తున్నాడట…నటి ఆరోపణలు..!

‘మీటూ’ ఉద్యమం ఇక అయిపొయింది… అయిపొయింది… అని అనుకుంటున్నప్పుడల్లా ఎవరోఒకరు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మేము పలనా దర్శకుడు వలనో లేక నిర్మాత వలనో లేక హీరో వలనో మోసపోయాం అంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కొందరు నటీమణులు. తాజాగా క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవిబాబు… తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి శిరీషా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన కెరీర్లో 50 కు పైనే సినిమాల్లో నటించింది శిరీష. ఐటెం గర్ల్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది.

అయితే తాజాగా దర్శకుడు రవిబాబు తనకి అవకాశాలు రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. ఆమె మాట్లాడుతూ… “గత కొన్నాళ్ళుగా నాకు జరిగిన అన్యాయం పై గొంతు విప్పుతున్నా.. ఇండస్ట్రీ అస్సలు పట్టించుకోవడం లేదు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. దర్శకులు నిర్మాతల పక్కల్లోకి అయితే మేం వెళ్ళాలి.. కానీ సినిమా ఆఫర్స్ మాత్రం ఇతర ఇండస్ట్రీ వాళ్ళకు ఇస్తున్నారు. గతంలో నేను పని చేసిన దర్శకులు, నిర్మాతల వద్దకు వెళ్తుంటే ఎవరో తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు, బెదిరిస్తున్నారు వెల్లడించింది. ‘నువ్విలా’ సినిమా కోసం దర్శకుడు రవిబాబుతో కలిసి పని చేశాను. అతను నాతో చాలా తప్పుగా ప్రవర్తించేవాడు.. ‘నీ రేటు ఎంత..?’ అంటూ బూతులు అసభ్యకరమైన మాటలు.. మెసేజ్ లు చేసేవాడు. రెండేళ్ళ నుండీ నన్ను టార్చర్ చేస్తున్నాడు. అవకాశాల కోసం దర్శకనిర్మాతలను సంప్రదిస్తుంటే.. వాళ్ళకి ఫోన్లు చేసి అవకాశాలు ఇవ్వొద్దని చెబుతున్నాడు. అతడి పక్కలోకి వెళ్ళలేదని బతుకు లేకుండా చేస్తున్నాడు. పెద్ద డైరెక్టర్ కదా అని నన్ను ఏం చేస్తాడో అని భయమేసి ఇప్పటివరకూ ఎవరికీ చెప్పలేదు. రవిబాబు వల్ల నాకు ప్రాణహాని ఉంది” అంటూ చెప్పుకొచ్చింది శిరీష. దీంతో ‘రవిబాబు ఇంత చీప్ డైరెక్టరా’ అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus