సుచిత్రా కృష్ణమూర్తి… తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తే. కానీ తెలుగులో ఈమె సినిమాలు చేయలేదు. 1991లో మలయాళం మూవీ ‘కిలుక్కింపెట్టి’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత ‘శివరంజని’(తమిళ సినిమా)లో మెయిన్ హీరోయిన్ గా నటించింది. అటు తర్వాత ‘జజ్బాత్ ఆగ్’ ‘కభీ హా కభీ నా’ ‘రోమియో అక్బర్ వాల్టర్’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమె సింగర్ గా కూడా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది.శేఖర్ కపూర్‌ను గతంలో వివాహం చేసుకున్న ఈమె 2007లో విడాకులు తీసుకుంది.
తన భర్తతో విడిపోవడానికి స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా కారణమని చెప్పిన ఈమె ఇప్పుడు మరో దర్శకుడి గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. సిద్ధార్థ్ కన్నన్ హోస్ట్ చేస్తున్న ఓ ఇంటర్వ్యూలో సుచిత్రా కృష్ణమూర్తి పాల్గొని ఎవ్వరూ ఊహించని విషయాలు తెలియజేస్తూ అందరినీ షాక్ కు గురిచేస్తుంది. ఆమె మాట్లాడుతూ.. ‘గతంలో ఓ పేరున్న డైరెక్టర్ తో నేను కారులో వెళ్తుండగా.. ‘నాతో రాత్రంతా గడుపు.. దానికి బదులుగా నీకు పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలు కల్పిస్తాను.
మీ నాన్నకి ఫోన్ చేసి ఆడిషన్ ఉంది అని చెప్పు. రేపు నేను మీ ఇంటికి తీసుకొచ్చి దిగబెడతా అని కూడా చెప్పు’ అంటూ నాతో అన్నాడు. ఆ క్షణం నాకు కన్నీళ్లు ఆగలేదు. వెంటనే అతనికి బుద్ధి చెప్పాలి అనిపించింది కానీ భయంతో నేను ఏమీ చేయలేకపోయాను’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది సుచిత్రా కృష్ణమూర్తి.