స్టార్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్లు ఎందుకు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

  • March 4, 2022 / 07:02 PM IST

స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ బడ్జెట్ తో కూడుకొని ఉంటాయి. ఓ స్టార్ హీరోయిన్, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లు, అదిరిపోయే లోకేషన్లు, సెట్టింగ్ లు, కొత్తగా వి.ఎఫ్ ఎక్స్ వంటివి కూడా యాడ్ అయ్యాయి. ఇవన్నీ కలిగి ఉంటేనే స్టార్ హీరో సినిమాకి ఓ మంచి లుక్ వస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు కూడా వీటి విషయంలో తగ్గరు. అయితే స్టార్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్ లు అవసరం లేదు అంటుంది ఓ స్టార్ హీరోయిన్.

వాళ్ళ పక్కన ఫ్లాప్ హీరోయిన్లు సరిపోతారు అంటూ ఘాటుగా కామెంట్ చేస్తుంది. ఈమె ఓ హీరోయిన్ సెంట్రిక్ మూవీతో బాగా పాపులర్ అయ్యింది. తర్వాత తమిళ్ లో అడ్డమైన సినిమాలు అన్నీ చేసి తెలుగు సినిమాలను నెగ్లక్ట్ చేసింది. కట్ చేస్తే తమిళ్ లో కూడా ఈమె సక్సెస్ రేటు పడిపోయింది. దాంతో టాలీవుడ్ లో మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. కానీ అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తుంది.

ఈ మూవీలో ఆమెను ఎంపిక చేసుకోవడం ఆ స్టార్ హీరో అభిమానులకి ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ వాళ్ళు చేసేది ఏమీ లేదు కదా…! ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ‘ఈ మధ్య కాలంలో మీరు చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇప్పుడు స్టార్ హీరో సినిమాలో నటిస్తున్నారు. ఇది మీ ఫ్లాప్స్ కు బ్రేక్ వేసి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుంది అనుకుంటున్నారా? ‘ అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది.

దానికి ఆమె ‘ స్టార్ హీరో సినిమాల్లో నటించడం వల్ల స్టార్ హీరోయిన్లకి కలిసొచ్చేది ఏమీ ఉండదు. ఒక విగ్రహం లా పడి ఉండడం, ఒకవేళ కదలాల్సి వస్టే రోబో లాగా డైరెక్టర్ చెప్పినట్టు కదలాలి. ఒకవేళ సినిమా హిట్ అయినా మమ్మల్ని గుర్తించరు. నిజానికి వాళ్ళ పక్కన ఫ్లాప్ హీరోయిన్లే కరెక్ట్. కానీ వాళ్ళని పెట్టుకున్నప్పుడు ఆ సినిమా కనుక హిట్ అయితే మళ్ళీ మా మొహాలు ఎవరూ చూడరు. వాళ్ళ దగ్గరకే పోతారు. చాలా మంది స్టార్ హీరోయిన్లకి ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది ‘ అంటూ తన ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటపెట్టింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus