అక్కయ్య బదులు స్టార్ హీరోయిన్స్ ను టార్గెట్ చేస్తున్న సిస్టర్

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలంటే చాలా దారులున్నప్పటికీ.. ఇప్పటి జనాలు ఎక్కువగా ఎంచుకొనే మార్గం మాత్రం ఒకటే. అదేంటంటే.. బాగా పాపులర్ అయిన నటీనటులు లేదా రాజకీయ నాయకులపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం. ఇలా జనాల్ని తిట్టడమే పనిగా పెట్టుకోవడానికి పెద్దగా క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. కనీస ఇంగితం లేని నోరు, సిగ్గు లేని మనస్తత్వం ఉంటే సరిపోతుంది. ఈ రెండు పుష్కలంగా ఉన్నట్టున్నాయి కంగనా చెల్లెలు రంగోలీకి. అందుకే.. సినిమాల ద్వారా సాధించలేకపోతున్న పాపులారిటీని సోషల్ మీడియా ద్వారా తెచ్చుకోంటోంది.

నిన్నమొన్నటివరకూ కత్రినా కైఫ్, వరుణ్ ధావన్, కరణ్ జోహార్, క్రిష్ లపై పడి ఏడ్చిన రంగోలీ తాజాగా దీపికా పడుకోనెను టార్గెట్ చేసింది. అందుకు కారణం లేకపోలేదు.. కంగనా తాజా చిత్రమైన “జడ్జ్ మెంటల్ హై క్యా” అనే సినిమా టైటిల్ విషయంలో తన కాంటాక్ట్ ను వాడి దీపిక రిలీజ్ కి అడ్డుపడింది. ఈ విషయంలో పగ పెంచుకొందో ఏమో కానీ.. దీపిక మీద ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేయడం మొదలెట్టింది. దీపిక చేసిన డిప్రెషన్ వీడియో మీద ఇదేం మెంటల్ వీడియో అని రంగోలీ కామెంట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus