ధనుష్ తో హీరోయిన్ బెడ్ సీన్.. ఎన్నిసార్లు షూట్ చేశారంటూ ప్రశ్నలు!

కోలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘పేటా’, ‘మాస్టర్’, ‘మారన్’ వంటి సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈమె #AskMalavika అంటూ అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన కొంటె ప్రశ్నకు.. ఘాటుగా స్పందించింది మాళవిక.

‘మారన్’ సినిమాలో బెడ్ సీన్లను ఎన్ని సార్లు చిత్రీకరించారని ఓ నెటిజన్ అడిగాడు. దానికి మాళవిక.. ‘మీ తలలో ఏదో పాడైనట్లుంది’ అని రిప్లై ఇచ్చింది. దీంతో సదరు నెటిజన్ సైలెంట్ అయిపోయాడు. ఇదే చిట్ చాట్ లో ఆమె మరిన్ని విషయాలను పంచుకుంది. తనకు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో రొమాంటిక్ సినిమా చేయాలనుందని తెలిపింది. అలానే మహేష్ బాబు గురించి గొప్పగా మాట్లాడింది. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది.

‘పట్టం పోలె’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహనన్. సినిమాటోగ్రాఫ‌ర్ కె.యు.మోహ‌న‌న్ కుమార్తెగా ఆమె ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీగానే దొరికింది. తెలుగులో ఈమె ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ఈమెనే హీరోయిన్ గా తీసుకుంటున్నారని టాక్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus