అరెస్ట్ అయినా…. మళ్ళీ దొంగ పోలీస్ గా మారి బ్లాక్ మెయిల్ చేస్తుందట!

ఆకలి, డబ్బు మాత్రమే కాదు… సినిమా పై ఉన్న వ్యామోహం కూడా చాలా దారుణాలు చేయిస్తుంది అని ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. ‘సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాము… డబ్బులు ఉన్నాయా? అంటే ఆలోచించకుండా లక్షలు పోసేసే కుర్రాళ్ళు ఉన్నారు, అలాగే ‘సినిమాల్లో అవకాశం ఇప్పిస్తాము అంటే.. ముందు వెనుక ఆలోచించకుండా శరీరాన్ని అర్పించేసే అమ్మాయిలు కూడా ఎక్కువ అవుతున్నారు’ వంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం.

Swarnalatha

అయితే ఇదే సినిమా పిచ్చితో ఓ నటి దొంగ పోలీస్ గా మారి స్కాములు వంటివి చేసి అరెస్ట్ అయిన సందర్భం కూడా ఉంది అంటే నమ్మడానికి కష్టంగా ఉంటుందేమో. కానీ ఇది నిజం. వివరాల్లోకి వెళితే… గతంలో నోట్ల మార్పిడి కేసులో అరెస్టైన రిజర్వ్‌ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ స్వర్ణలత మళ్ళీ వార్తల్లో నిలిచారు. మొన్నామధ్య 2000 రూపాయల నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలత (Swarnalatha) అరెస్ట్ అవ్వడం జరిగింది.

సినిమాల్లో నటించాలన్న వ్యామోహంతో డబ్బులు కూడగట్టుకునేందుకు ఆమె దొంగ పోలీస్ గా మారింది. తద్వారా కొంతమందిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించింది. ఆ డబ్బుతో నటనలో శిక్షణ కూడా పొందింది.డాన్సులు వంటివి కూడా నేర్చుకుంది.’ఏపీ 31′ పేరుతో ఈమె ఓ సినిమాలో కూడా నటిస్తున్నట్టు పోస్టర్ వదిలింది. ఆమె డ్యాన్స్ వీడియో, అలాగే పోస్టర్ వంటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది.

అటు తర్వాత ఈమె స్కాములు బయటపడటంతో.. సైలెంట్‌ అయ్యింది స్వర్ణలత (Swarnalatha). ఇప్పుడు మళ్ళీ నకిలీ పోలీస్ గా మారి దండాలు చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. బాపట్ల జిల్లాలో ఆమె ఏఆర్‌ ఇన్స్‌పెక్టర్‌గా స్కాముల కోసం డ్యూటీ చేస్తుందట.ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమె పరారైనట్లు సమాచారం.

శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus