‘సామజవరగమన'(Samajavaragamana) తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) కొంత వరకు పర్వాలేదు అనిపించినా.. ‘శ్వాగ్'(Swag) డిజాస్టర్ అయ్యింది. దీంతో మళ్ళీ తన మార్క్ కామెడీ జోనర్లో ‘సింగిల్’ (#Single) అనే మూవీ చేశాడు శ్రీవిష్ణు. ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ (Bunny Vasu), విద్యా కొప్పినీడి (Koppineedi Vidya) ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పకులు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీజర్, ట్రైలర్లు మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. ముఖ్యంగా ‘శివయ్యా’, ‘మంచు కురిసిపోవడం’ వంటి డైలాగులు వివాదాస్పదం అవ్వడంతో.. సినిమాకు మరింత పబ్లిసిటి వచ్చినట్టు అయ్యింది. తర్వాత టీం క్షమాపణలు చెప్పినా… అప్పటికే ట్రైలర్ కి రావాల్సిన మైలేజ్ వచ్చేసింది అనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకి ‘సింగిల్’ స్పెషల్ షో వేయడం జరిగింది.
సినిమా చూశాక వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘సింగిల్’ (#Single) రన్ టైం 2 గంటల 9 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట. శ్రీవిష్ణు ఎంట్రీ సీన్, ఫ్లాష్ బ్యాక్ ట్రాక్, వెన్నెల కిషోర్ (Vennela Kishore) కామిడీ వంటివి ప్రేక్షకులను ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద ట్విస్ట్ ఒకటి ఉంటుందట.
సెకండ్ హాఫ్ లో సార్టింగ్ వద్ద వచ్చే ఒక ట్రాక్ ఆడియన్స్ ను విపరీతంగా నవ్విస్తుంది అంటున్నారు. క్లైమాక్స్ కూడా బాగా డిజైన్ చేశారు అంటున్నారు. నిర్మాణ విలువలు , డైరక్షన్, సంభాషణలు వంటివి సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అంటున్నారు. మరి మార్నింగ్ షోల నుండీ ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.