‘ఓజి’ (OG Movie) … పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. ‘సాహో’ (Saaho) ఫేమ్ సుజిత్ (Sujeeth) ఈ చిత్రానికి దర్శకుడు. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ కి భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అర్జున్ దాస్ డైలాగ్స్ వంటివి కూడా సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ ఈవెంట్స్ లో ఉన్నప్పుడు చాలా మంది అభిమానులు ‘ఓజి ఓజి’ అని అరవడం..
అందుకు పవన్ కళ్యాణ్… ‘సినిమా కచ్చితంగా బాగుంటుంది అని చెప్పడం’ తో సినిమాపై హైప్ పెరుగుతూనే ఉంది తప్ప.. తగ్గడం లేదు. ఇదిలా ఉంటే.. ‘ఓజి’ షూటింగ్ కొంత పార్ట్ బ్యాలెన్స్ ఉంది. దీనికంటే ముందు ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) షూటింగ్ ను పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాల్సి ఉండటంతో డిలే అయ్యింది. మొత్తానికి ఇప్పుడు పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చారు.
త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మిగిలిన షెడ్యూల్స్ ను థాయ్ ల్యాండ్, బ్యాంకాక్ వంటి ఏరియాల్లో ప్లాన్ చేశారు. కానీ పవన్ ఉన్న బిజీకి ఇప్పుడు దేశాలు దాటి రాలేడు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో సూటబుల్ అయ్యే తాడేపల్లి వంటి ఏరియాల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. ఒక సాంగ్ చిత్రీకరణ, క్లైమాక్స్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్టు సమాచారం.