సూర్య (Suriya) నటించిన ‘రెట్రో’ (Retro) సినిమా ఇటీవల అంటే మే 1న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. మరోపక్క ఈ సినిమా ప్లాప్ కి పూజా హెగ్డే కూడా కారణమంటూ కొంతమంది అర్థం లేకుండా ముచ్చటిస్తున్న విధానం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) కథకుడిగా మంచి లైన్ తీసుకున్నా.. దాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా తెరకెక్కించలేకపోయాడు అని ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. అందులో వాస్తవం ఉంది.
ఈ విషయాన్ని పరోక్షంగా కార్తీక్ సుబ్బరాజ్ కూడా అంగీకరించాడు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే… ‘రెట్రో’ సినిమాతో వచ్చిన లాభాల్లో సూర్య (Suriya) రూ.10 కోట్లు తన అగరం ఫౌండేషన్ ను దానం చేసినట్టు ప్రకటించింది సూర్య అండ్ టీం. అయితే ఓ పక్క ‘రెట్రో’ సినిమా డిజాస్టర్ అంటుంటే… ఇప్పుడు ‘దానాలు చేసేంత లాభాలు వచ్చాయా?’ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘రెట్రో’ కి సూర్య కూడా ఓ నిర్మాత.
అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాని రూ.65 కోట్ల బడ్జెట్లోనే ఫినిష్ చేశారు. విడుదలకి ముందే నిర్మాత సేఫ్ జోన్లోకి వచ్చేశాడు. కానీ మరోపక్క డిస్ట్రిబ్యూటర్లు కొంత వరకు నష్టపోవడం ఖాయమనే స్పందన లభిస్తుంది. మరి ఇలాంటి టైంలో సూర్య ఆదుకోవాల్సింది వాళ్ళని కదా? వాళ్ళని పక్కన పెట్టి… తన ట్రస్ట్ కి డొనేషన్ ఇచ్చినట్టు ప్రకటించడం ఏంటి?