స్టార్ యాంకర్లు మన టాలీవుడ్లో ఎంతో మంది ఉండొచ్చు… కానీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ.. అందరిళ్ళలో ఓ ఫ్యామిలీ మెంబెర్ లా మారిపోయిన స్టార్ యాంకర్ అంటే అందరికీ ఒకరి పేరే గుర్తొస్తుంది. యెస్ అనుమానం లేకుండా ఆమె సుమ కనకాలనే..! ఓ మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. చెప్పాలంటే తెలుగు వారు కూడా ఈమె అంత స్పీడ్ గా తెలుగు మాట్లాడలేరు అనడంలో అతిశయోక్తి లేదు.
ఇదిలా ఉండగా.. వారానికి వారం రోజులు, నెలకు నెల రోజులు బిజీ ఉంటుంది సుమ కనకాల. ఏ సినిమా ఫంక్షన్ కు అయినా సరే ఈమె ఉండాల్సిందే. లేకపోతే ఆ సినిమా వేడుకకి కళే ఉండదు. అందుఎక్ రూ.1.5 లక్షలు ఇచ్చి మరీ ఈమెనే యాంకర్ గా ఫిక్స్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. ఇంత బిజీగా ఉండే మన సుమ కనకాల.. సోషల్ మీడియాలో కూడా అభిమానులతో టచ్ లో ఉంటూనే ఉంటుంది. అప్పుడప్పుడు తన లేటెస్ట్ పిక్స్ ను.. తన భర్త రాజీవ్ కనకాలతో ఉన్న పిక్స్ ను అప్లోడ్ చేస్తూ వచ్చే సుమ..
ఇటీవల తన వింటేజ్ పిక్ ను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫొటోలో ఈమె నాట్యం చేస్తుండడం విశేషం.’మా అమ్మకు నాట్యం అంటే చాలా ఇష్టం. నేను కూడా నాట్యం చేస్తే చూడాలని ఆశపడేది. నాకు కూడా డ్యాన్స్ చెయ్యడం ఇష్టమే.మిసెస్ భద్ర.. అని నాకో డ్యాన్స్ టీచర్ ఉండేది. ఆమె దగ్గర నేర్చుకుని స్కూల్ లో పెర్ఫామ్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది’ అంటూ ఈ ఫోటో వెనుక ఉన్న కథను చెప్పుకొచ్చింది సుమ. ఏమైనా సుమలో మరో ట్యాలెంట్ కూడా దాగి ఉందని ఈ ఫోటోతో స్పష్టంచేసింది.