Sivasankar Master: విషమంగా శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం.. ఏమైందంటే?

  • November 24, 2021 / 10:32 PM IST

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో శివ శంకర్ మాస్టర్ ఒకరనే సంగతి తెలిసిందే. పదికి పైగా భాషలలో శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. పలు డ్యాన్స్ షోలకు శివ శంకర్ మాస్టర్ జడ్జిగా కూడా పని చేశారు. మగధీర సినిమాలోని ధీరధీర సాంగ్ కొరియోగ్రాఫర్ గా శివ శంకర్ మాస్టర్ కు మంచిపేరు తెచ్చిపెట్టింది. శివ శంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో శివ శంకర్ మాస్టర్ చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. శివ శంకర్ మాస్టర్ కొడుకు మినహా ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. శివ శంకర్ మాస్టర్ కరోనా చికిత్సకు ఎక్కువ మొత్తం ఖర్చవుతూ ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని చెల్లించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఇండస్ట్రీ నుంచి ఆర్థిక సాయం అందుతుందని శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

శివ శంకర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా పూర్తిస్థాయిలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టలేదు. శివ శంకర్ మాస్టర్ కొడుకు అజయ్ కృష్ణ సినీ సెలబ్రిటీలు కష్ట సమయంలో తమ కుటుంబాన్ని ఆదుకుంటారని భావిస్తున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus