Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ పై నోరు పారేసుకున్న స్టార్ క్రికెటర్.. ‘ఇదేం పోలికరా దరిద్రుడా’ అంటూ..!

ఇప్పటికీ ‘అందానికి అడ్రస్?’ అంటే టక్కున ‘ఐశ్వర్య రాయ్’ పేరే చెబుతారు ఎవరైనా అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు. గత ఏడాది వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్-1’ ‘పొన్నియన్ సెల్వన్ -2’ సినిమాల్లో ఆమె ఎంత అందంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోపక్క ఆమె హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తుంది. వివాదాలకు చాలా దూరంగానే ఉంటూ వస్తోంది. ఇలాంటి టైంలో ఐశ్వర్య రాయ్ పై నోరు పారేసుకున్నాడు ఓ స్టార్ క్రికెటర్.సంబంధం లేని టాపిక్ కి అనవసరంగా ఐశ్వర్య రాయ్ ని ఇన్వాల్వ్ చేసి చాలా నీచంగా మాట్లాడాడు.

అతను మరెవరో కాదు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. అతనొక సూపర్ బ్యాట్స్మెన్,బౌలర్ కూడా..! ఒంటి చేత్తో ఎన్నో సార్లు మ్యాచ్..లు గెలిపించిన ఘనత ఆయనది. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ 2023 లో పాకిస్థాన్ టీమ్ 9 మ్యాచ్..లు అడగా అందులో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి.. 5 మ్యాచ్ లలో ఓడిపోయింది. పాకిస్థాన్ వరస్ట్ పెర్ఫార్మన్స్ పై అబ్దుల్ రజాక్ స్పందిస్తూ..

ఐశ్వర్యరాయ్ ని (Aishwarya Rai) పెళ్లి చేసుకుని మంచి, పవిత్రమైన పిల్లలు పుట్టాలని కోరుకోవడం అనేది చాలా తప్పు. అలాగే ‘టీంకి సరైన గైడెన్స్ ఇవ్వకుండా.. మంచి ఫలితాలు కావాలంటే ఎలా కుదురుతుంది?’ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. పక్కనే ఉన్న షాహిద్ అఫ్రిదీ, ఉమర్ గుల్ వంటి వారు కూడా చప్పట్లు కొట్టారు. దీంతో పాక్ క్రికెటర్ల వంకర బుద్ది మరోసారి బయటపడింది అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus