సినిమాలకు గుడ్ బై చెబుతున్న స్టార్ డైరెక్టర్.. కారణం అదే!

ఓ మంచి బ్లాక్ బస్టర్ అందించిన ఏ దర్శకుడైనా.. సినీ పరిశ్రమని వదిలేయాలని అనుకోరు. హిట్టు కొట్టే వరకు సినిమాలు చేస్తూనే ఉంటారు. ‘నేనింతే సినిమాలో రవితేజ చెప్పినట్టు ‘సినిమా హిట్టయినా.. ప్లాప్ అయినా మనకి సినిమా తప్ప ఇంకేమి తెలీదు’ అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఓ దర్శకుడు మాత్రం సినిమాల నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్టు తెలిపి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. అతను మరెవరో కాదు..

2015 లో మలయాళంలో ‘ప్రేమమ్’ అనే బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన అల్ఫోన్స్ పుత్రేన్. ఆ ఒక్క సినిమాతో అతను దేశం మొత్తం పాపులర్ అయిపోయాడు. అదే చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగులో నాగ చైతన్య హీరోగా రూపొందిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘అవియల్’ ‘గోల్డ్’ ‘గిఫ్ట్’ వంటి సినిమాలను కూడా అందించాడు. అయితే ఇటీవల అల్ఫోన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

అందులో అతను (Director) బక్కచిక్కి పోయి కనిపించి అందరికీ షాకిచ్చాడు. దీనికి కారణం అతను అనారోగ్యం పాలవ్వడమే అని తెలుస్తుంది. దీంతో స్వయంగా అతనే ఈ విషయం పై క్లారిటీ ఇచ్చేశాడు. అల్ఫోన్స్ మాట్లాడుతూ… ‘నా సినిమా థియేటర్ కెరీర్ అపేస్తున్నాను. నేను ఎంతో కాలంగా అటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ తో బాధపడుతున్నాను. నేను ఎవరికీ భారంగా ఉండాలని అనుకోవడం లేదు. సాంగ్, వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ మాత్రం చేస్తాను.

ఓటీటీ కంటెంట్ కూడా చేస్తాను. నిజానికి సినిమాలు అపేయాలని నేను అనుకోవడం లేదు. కానీ వేరే అవకాశం లేకుండా పోయింది.నేను చేయలేని వాటి గురించి ప్రామిస్ చేయలేను. అనారోగ్యం ఉన్నప్పుడు జీవితంలో ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇలా వస్తుంది అని తెలుసుకున్నాను’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus