Samantha: సమంతపై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్.. ఏం చెప్పారంటే?

  • April 18, 2023 / 05:15 PM IST

స్టార్ హీరోయిన్ సమంతకు విడాకుల తర్వాత కెరీర్ పరంగా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినా ఆ సినిమాల ఫలితాలు సమంతకు ప్లస్ కావడం లేదు. శాకుంతలం సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా ఫలితం ఆమెను ఎంతగానో బాధ పెట్టిందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. అయితే ప్రముఖ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు తాజాగా సమంత గురించి మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు.

కెరీర్ తొలినాళ్లలో సమంత (Samantha) వ్యవహరించిన తీరు గురించి ఆయన చెప్పుకొచ్చారు. తెలుగులో సమంతను ఫస్ట్ అడిషన్ చేసింది నేనేనని శివ నాగేశ్వరరావు కామెంట్లు చేశారు. సమంతను టాలీవుడ్ ఇండస్ట్రీకి తానే పరిచయం చేయాల్సిందని ఆయన చెప్పుకొచ్చారు. మేము అడిషన్ కు పిలిచిన సమయంలో సమంత చెన్నైలోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుతోందని శివ నాగేశ్వరరావు అన్నారు.

సమంతను అడిషన్ కోసం హైదరాబాద్ కు పిలిచామని అడిషన్ పూర్తైన తర్వాత సమంతను చెన్నైకు పంపించాలని అనుకుంటే ఆ సమయంలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. తర్వాత రోజు టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో ఒక్కరోజు హైదరాబాద్ లో ఉండాలని సమంతను కోరామని అయితే ఆమె అందుకు అంగీకరించలేదని శివ నాగేశ్వరరావు కామెంట్లు చేశారు.

హైదరాబాద్ లో ఒక్కరోజు ఉండటానికి కూడా సమంత అంగీకరించలేదని చేసేదేం లేక ఎక్కువ ధరకు టికెట్ బుక్ చేసి సమంతను పంపించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సమంత ఎక్కువ మొత్తం పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమెను సెలెక్ట్ చేయలేదని శివ నాగేశ్వరరావు కామెంట్లు చేశారు. ఆమె అడిగిన స్థాయిలో బడ్జెట్ లేకపోవడంతో మేము వెనక్కు తగ్గామని ఆయన చెప్పుకొచ్చారు. శివ నాగేశ్వరరావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus