Star Director: ‘డైరెక్టర్ గా నా పేరు వేయకండి.. నేను ప్రమోషన్స్ కి రాను’ అంటున్న దర్శకుడు!

  • August 12, 2023 / 05:47 PM IST

ఏ డైరెక్టర్ కి అయినా హిట్లు … ఫ్లాప్ లు రావడం సహజం. ఇంకో విధంగా చెప్పాలి అంటే .. ఓ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా క్రెడిట్ మొత్తం దర్శకుడికే చెందుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం డైరెక్టర్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఎక్కువ మందికి తెలీదు. దర్శకుడు మొదట అనుకున్న కథ అదే విధంగా సెట్స్ పైకి వెళ్తుంది అనేది కచ్చితంగా చెప్పలేం.

ఇది సునీల్ – రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ అప్పల్రాజు ‘ సినిమా చూసిన వాళ్లకి బాగా తెలుస్తుంది. ఆ సినిమాలో దర్శకుడిగా సునీల్ నటించాడు. అందులో అతను చేయాలి అనుకున్న సినిమా ఒకటి. ఆ సినిమా ఫెయిల్ అయినా .. కొన్ని సినిమాల ప్రమోషన్స్ కి ఆ సినిమా పేరుని వాడిన సంగతి కూడా తెలిసిందే. సరే ఇక అసలు విషయానికి వస్టే ..

ఇటీవల ఓ (Director) దర్శకుడు.. తాను తీసిన సినిమా తనకే నచ్చలేదు అంటూ నిర్మాతతో తన పేరు కూడా వేయొద్దు అని చెప్పి షాక్ ఇచ్చాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు జేడీ చక్రవర్తి. గతంలో ఇతను హోమం, సిద్దం వంటి సినిమాలు తీశాడు. ‘ హు ‘ అనే టైటిల్ తో జేడీ ఓ సినిమాని డైరెక్ట్ చేశాడు. కానీ ఆ సినిమా అతనికి నచ్చలేదట. దీంతో నిర్మాతకి తన పేరు వేయొద్దు అని చెప్పాడట.

కాదు అని .. దర్శకుడిగా తన పేరు వేస్తే ప్రమోషన్ కి రాను అని చెప్పాడట. దయ సిరీస్ తో అతనికి మంచి పేరు వచ్చింది కాబట్టి.. ఈ టైంలో హు అనే సినిమా రిలీజ్ అయితే తన ఫేమ్ దెబ్బతింటుంది అని అతను భయపడుతున్నట్టు తెలుస్తుంది. నిర్మాత చేసేదేమీ లేక జేడీని బ్రతిమలాడి కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus