తనతో సినిమా చేసిన, చేస్తున్న హీరోలను దర్శకులు పొగడం కొత్త విషయమేమీ కాదు. స్టార్ హీరోకి ఇచ్చే ఎలివేషన్లలా ఇచ్చుకోవచ్చు ఎవరూ కాదనరు. అయితే ఆ క్రమంలో మిగిలిన హీరోల అభిమానుల మనోభావాలు దెబ్బతినడం, దెబ్బతినేలా చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. తాజాగా ఓ కొత్త దర్శకురాలు ఈ పని చేశారు. ‘వరుడు కావలెను’ సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్న లక్ష్మీసౌజన్య మాటలివీ… నిజానికి ‘వరుడు కావలెను’ సినిమా కతను తొలుత నాగచైతన్యకు చెప్పారట లక్ష్మీసౌజన్య. కథ కూడా బాగా నచ్చిదట. అయితే…
కొన్ని కారణాల వల్ల సినిమా చేయలేకపోయారు. అప్పుడే నాగశౌర్యను కలిసి కథ వినిపించారట. అతను ఓకే చేయడంతో సినిమా ముందుకెళ్లింది… ఇప్పుడు సినిమా విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డైరక్టర్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. అప్పుడే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వరుడు కావలెను’కథ రాసేటప్పుడు శౌర్యనే దృష్టిలో పెట్టుకున్నారట లక్ష్మీ సౌజన్య. ఎందుకంటే ఆత్మాభిమానం ఉన్న ఓ అమ్మాయి.. ఒక అబ్బాయిని ప్రేమించాలంటే అతనిలో చాలా క్వాలిటీస్ ఉండాలి.
మంచి లక్షణాలు, చూడగానే ఆకర్షించే అందం వాటిలో కొన్ని. శౌర్యలో అవన్నీ చూశా అని చెప్పుకొచ్చారు లక్ష్మీసౌజన్య. అంటే చిత్ర పరిశ్రమలో ఇలాంటి లక్షణాలు ఇంకెవరిలోనూ లేవని అంటున్నారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అదన్నమాట మేటర్.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?