మాజీ స్టార్ కపుల్ తో ధనుష్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో

  • July 24, 2022 / 10:21 PM IST

రజినీకాంత్ మాజీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ గ్లోబల్ హీరో అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆల్రెడీ అతను క్రేజీ హీరో అయిపోయాడు. హాలీవుడ్ లో కూడా ఆల్రెడీ ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ది గ్రే మ్యాన్’ లో కూడా నటిస్తున్నాడు. జూలై 22 నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి హాలీవుడ్ డైరెక్టర్స్ అయిన రూసో బ్రదర్స్‌(జో రూసో – ఆంటోనీ రూసో) తెరకెక్కించారు.

‘ది గ్రే మెన్’ ప్రమోషన్లో భాగంగా వీరు ఇండియా కి కూడా వచ్చారు. ధనుష్‌ తో కలిసి రూసో బ్రదర్స్‌ ఇండియాలో ఈ చిత్రాన్ని వీక్షించడం జరిగింది. ముంబైలో కూడా ప్రమోషన్లకు హాజరైనప్పుడు అక్కడి స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. విశేషం ఏంటి అంటే ఆమిర్… తన మాజీ భార్య కిరణ్ రావు తో కలిసి రూసో బ్రదర్స్ మరియు ధనుష్ లకి ఆతిథ్యం ఇచ్చాడు.ఈ విందులో రూసో బ్రదర్స్ మరియు ధనుష్ లకు గుజరాతి వంటకాలు రుచి చూపించారట ఈ మాజీ దంపతులు.

ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమిర్ – కిరణ్ విడాకులు తీసుకున్నప్పటికీ స్నేహితులుగా ఎప్పటికీ కలిసే ఉంటామని చెప్పిన సంగతి తెలిసిందే. వారు అన్న మాట ప్రకారం అలాగే కలిసుంటున్నారు అనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ఈ రకంగా ఎంతో మందికి వీరు ఆదర్శంగా నిలిచారు అని కూడా చెప్పవచ్చు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus