టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ అఖండ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులు అన్నీఇన్నీ కావు. బుల్లితెరపై కూడా అఖండ మూవీ అంచనాలకు మించి సక్సెస్ అయింది. అయితే అఖండ సక్సెస్ తర్వాత బాలకృష్ణ మాస్ మసాలా కథలకు మాత్రమే ఓటేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో మాస్, యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే.
బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ కూడా మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండనుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం మాస్ ప్రేక్షకులను మాత్రమే టార్గెట్ చేసేలా సినిమాలు ఉండేలా బాలయ్య ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో బాలయ్య కొన్ని క్లాస్ సినిమాలలో నటించారు. అయితే బాలయ్య నటించిన క్లాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ఈ రీజన్ వల్లే బాలయ్య మాస్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే క్లాస్ ప్రేక్షకులలో కూడా బాలయ్యకు భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ కూడా ఒక సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో ఈ కాంబినేషన్ లో భవిష్యత్తు ప్రాజెక్ట్ ను తెరకెక్కించడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల నుండి 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.