Balakrishna: ఆ హీరో జాతకాన్ని బాలయ్య మారుస్తారా..?

  • June 15, 2021 / 01:36 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుసగా కొత్త సినిమాలకు కమిటవుతూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య భవిష్యత్ ప్రాజెక్ట్ లపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన లెజెండ్ సినిమాలో విలన్ రోల్ లో నటించి జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస ఆఫర్లతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న అఖండ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా కొన్ని రోజుల క్రితం బాలయ్య శ్రీకాంత్ ను విలన్ పాత్రల్లో నటించవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే శ్రీకాంత్ కోసం బాలకృష్ణ కథలు వింటున్నారని శ్రీకాంత్ కు సూట్ అయ్యే కథలు, పాత్రలను స్వయంగా తానే ఎంపిక చేయాలని బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి శ్రీకాంత్ జాతకాన్ని బాలయ్య ఏ విధంగా మారుస్తారో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే. బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమాలో కూడా శ్రీకాంత్ నటించిన సంగతి తెలిసిందే. అఖండ సినిమాతో శ్రీకాంత్ దగ్గరవ్వడంతో బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జగపతిబాబులా శ్రీకాంత్ విలన్ పాత్రల్లో బిజీ కావాలని భావిస్తుండగా బాలయ్య మాత్రం శ్రీకాంత్ ఇతర పాత్రలతో కూడా బిజీ కావాలని అతని సినీ కెరీర్ పై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు బాలయ్య అఖండ మూవీ రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. దసరా, సంక్రాంతి సీజన్లకు ఇప్పటికే తమ సినిమాలను రిలీజ్ చేయనున్నట్టు పలువురు హీరోలు ప్రకటించడంతో బాలయ్య తన సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus