స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి, బాహుబలి2 సినిమాలతో పాన్ వరల్డ్ హీరోగా ఎదిగారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో ప్రభాస్ అభిమానులు సైతం నిరాశ చెందుతున్నరనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాతో పాటు సలార్ సినిమాలో నటిస్తుండగా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ రావాల్సి ఉంది. రాధేశ్యామ్ సినిమా నష్టాలను భర్తీ చేయడానికి ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ అనే మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సర్జరీ జరగడం వల్ల ప్రభాస్ గత కొన్నిరోజులుగా రెస్ట్ తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ హెల్త్ ఇష్యూస్ వల్ల షూటింగ్ లు ఆలస్యం అవుతున్నాయని ప్రచారం జరుగుతుండగా ఆ రూమర్లకు చెక్ పెడుతూ ప్రభాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.
ఈ నెల 2వ తేదీ నుంచి షూటింగ్ మొదలు కాగా ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారని బోగట్టా. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో దీపికా పదుకొనే నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా నాగ్ అశ్విన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళతారని సమాచారం అందుతోంది. ప్రభాస్ కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.