స్టార్ హీరోయిన్లు నటించే హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో ఉండీ ఉండనట్టు ఓ హీరో ఉండాలి. అది కేవలం తెలుగులో రూపొందే సినిమా అయితే ఇక్కడి యంగ్ హీరోలనో లేక ఫేడౌట్ అయిపోయిన హీరోలనో పెట్టేసి చేతులు దులిపేసుకునేవారు దర్శకనిర్మాతలు. కానీ అదే పాన్ ఇండియా సినిమా అయితే కాస్త ఇమేజ్ ఉన్న హీరో కావాలి. అది కూడా పక్క భాషల్లో పాపులర్ అయిన హీరో అయితే ఇంకా హ్యాపీ. అందుకే గుణశేఖర్..
మలయాళం హీరో దేవ్ మోహన్ (Hero) ను పట్టేశాడు. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శాకుంతలం’ సినిమాలో దుష్యంతుడుగా దేవ్ మోహన్ నటించాడు. ఇతని లుక్స్ బాగున్నాయి. సమంతతో ఇతని రొమాంటిక్ సాంగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉండగా.. తెలుగులో మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మరో స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న హీరోయిన్ సెంట్రిక్ మూవీలో హీరోగా దేవ్ మోహన్ ఎంపికయ్యాడు.
అదే ‘రెయిన్ బో’ చిత్రం. నిజానికి ఇది కూడా సమంత ప్రధాన పాత్రలో రూపొందాల్సిన మూవీ. దర్శకనిర్మాతలు అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ సమంత ప్లేస్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన వచ్చి చేరింది. డ్రీం వారియర్ పిక్చర్స్ సంస్థ ‘ఒకే ఒక జీవితం’ తర్వాత తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది.
ఈ సినిమాలు కనుక హిట్ అయితే తెలుగులో దేవ్ మోహన్ క్రేజీ హీరో అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు అతను సోలో హీరోగా నటించే సినిమాలకు కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి.