దర్శకనిర్మాతల నడుమ ఉన్న సాపత్యం హీరో-డైరెక్టర్, హీరో-ప్రొడ్యూసర్ మధ్య ఉండదు. అయితే.. ఒకరితో ఒకరికి ఎంత పడకపోయినా షూటింగ్ స్పాట్ లో మాత్రం బాగానే ఉంటుంటారు. కానీ.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఓ భారీ చిత్ర నిర్మాత సదరు సినిమా హీరో నుంచి బెదిరింపులతో కూడిన బూతులు వినిపించాయట. ఇంతకీ ఎందుకు అంతలా వినిపించాయి అనుకొంటున్నారా.. పాపం సదరు హీరో ప్రీవియస్ మూవీ బిజినెస్ రికార్డ్ ను బట్టి ప్రెజంట్ సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ అండ్ బడ్జెట్ ను తగ్గిద్దామనుకొంటున్నాడట పాపం ఆ ప్రొడ్యూసర్.
పాపం ఆ ప్రొడ్యూసర్ ఆలోచనలో తప్పులేదు. హీరో పేరుకున్న పాపులారిటీ సినిమాలకి లేకపోవడం, పెట్టిన బడ్జెట్ లో సగం కూడా రిటర్న్ రాకపోవడం మొదలుకొని భారీ నష్టాలు కూడా రావడంతో.. పాపం ఈ బడా ప్రొడ్యూసర్ జాగ్రత్తలు తీసుకోంటున్నాడు. కానీ.. కెరీర్ మీద కానీ స్టార్ స్టేటస్ మీద కానీ ఏమాత్రం జాగ్రత్త లేని ఆ స్టార్ హీరో మాత్రం ఆ నిర్మాత మీద విరుచుకుపడడమే కాక బండ బూతులతో విరుచుకుపడ్డాడట. దాంతో అప్పట్నుంచి సెట్స్ కు రావడం మానేశాడట ఆ నిర్మాత. ఆ నిర్మాత ఎవరో కనిపెట్టలేకపోయినా ఈ పాటికే ఆ స్టార్ హీరో ఎవరో మీరు ఈజీగానే గుర్తుపట్టేసి ఉంటారు కదూ.