Star Hero: కావాలనే ఆ హీరో అన్ని టేకులు తీసుకున్నాడని అంటున్న నెటిజన్లు

Advertisement

అన్నను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. విజయ్ తమ్ముడిగా కాకుండా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటూ వస్తున్నాడు. ఇక అందులో భాగంగానే బేబీ సినిమా ఒప్పుకొని మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆనంద్ దేవరకొండపై అభిమానులు మంచి అంచనాలనే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం గం గం గణేశా. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ నటిస్తోంది.

హై లైఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి మరియు వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ను నేడు మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఇమ్మాన్యుయేల్ .. ఆనంద్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆనంద్ దేవరకొండ అన్నతో చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు మొదట.. ఆనంద్ అన్న ఉన్న ప్రతి సీన్ లో నేను కూడా ఉంటాను అని చెప్పారు.

అయితే.. ఒకరోజు నాకు సీన్ లేదు అన్నారు. నాకు లేదు అంటే ఆనంద్ అన్నకు కూడా ఉండదు అనుకున్నాను. అయితే అక్కడకు వెళ్లి చూస్తే .. ఆనంద్ అన్న లిప్ లాక్ సీన్ చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు 20 టేకులు తీసుకున్నాడు. టీజర్ లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది. టేక్స్ తీసుకున్న ప్రతిసారి ఏ ఇదంతా నా వల్ల కావడం లేదు..

అని ఆనంద్ అన్న చెప్పేవాడు. ఎలాగోలా 20 టేకుల తరువాత ఆ లిప్ లాక్ సీన్ ఓకే అయ్యింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus