Boyapati Srinu: బోయపాటికి ఛాన్స్ ఇచ్చే హీరోలు వీళ్లు మాత్రమేనా?

  • January 27, 2022 / 12:21 PM IST

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన మూడు సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన భద్ర, తులసి, సరైనోడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి. అఖండ సినిమా తర్వాత పలువురు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు బోయపాటి శ్రీనుకు అడ్వాన్స్ ఇచ్చారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే బోయపాటి శ్రీను తర్వాత సినిమాలో హీరో ఎవరనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా బన్నీ పుష్ప ది రూల్ లో నటిస్తున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో బోయపాటి శ్రీనుకు హీరోలు ఛాన్స్ ఇచ్చే పరిస్థితులు లేవు.

మరోవైపు వినయ విధేయ రామ్ ఫ్లాప్ ఎఫెక్ట్ బోయపాటి శ్రీనుపై ఉందని అందువల్లే బోయపాటి శ్రీనుకు ఛాన్స్ ఇచ్చే విషయంలో హీరోలు వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. అయితే బాలకృష్ణ, రామ్ మాత్రం బోయపాటి డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని బోగట్టా. ఈ ఇద్దరు హీరోలలో బోయపాటి శ్రీను ఏ హీరోతో తన తర్వాత సినిమాను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అయినా రొటీన్ కథలతోనే ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

బోయపాటి శ్రీను కొత్త తరహా కథలపై దృష్టి పెడితే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అఖండ సినిమాలో కూడా ఫస్టాఫ్ తేలిపోయిందని సెకండాఫ్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండటంతో సినిమా సక్సెస్ సాధించిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల అడ్వాన్స్ లు బోయపాటి శ్రీను దగ్గర ఉన్నాయని తెలుస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus