స్టార్ హీరోయిన్ సమంత ఒకవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సమంతకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నా సమంత మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తుండగా ఆమె నటించిన ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే కరోనా కష్ట కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సమంత గొప్పమనస్సును చాటుకున్నారు.
సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న ఎంతోమందికి చేయూతను అందిస్తున్నారు. తాజాగా ప్రత్యూష ఫౌండేషన్ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి పది ఆక్సిజన్ కాన్సనేటేటర్లను ఇచ్చినట్టు తెలుస్తోంది. కరోనా రోగుల కష్టాలను తీర్చేందుకు సమంత తన వంతు సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆక్సిజన్ కొరత వల్ల దేశంలోని చాలామంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో తను చేస్తున్న సహాయాలను పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా సమంత ఇష్టపడటం లేదు.
ఈ విషయం తెలిసిన నెటిజన్లు మిగిలిన హీరోయిన్లను తెగ ట్రోల్ చేస్తున్నారు. సమంతను చూసి స్టార్ హీరోయిన్లు బుద్ధి తెచ్చుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సమంతను చూసైనా మిగతా హీరోయిన్లు కరోనా బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సహాయం చేస్తారేమో చూడాల్సి ఉంది. మరోవైపు బంగార్రాజు సినిమాలో కూడా హీరోయిన్ గా సమంత పేరు వినిపిస్తుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!