సైలెంట్ పెళ్లి చేసుకున్న నటి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

మళ్ళీ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లిపీటలెక్కుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. నిన్నటికి నిన్న దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi)   … ప్రీతి చల్లా అనే డాక్టర్ ని రెండో వివాహం చేసుకున్నాడు. గతంలో ఇతను రమ్య అనే డాక్టర్ ని వివాహం చేసుకుని తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక క్రిష్ తో పాటు మరో దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) కూడా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశాడు. తాజాగా నిర్మాత కూతురు కమ్ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది.

Natti Kumar

వివరాల్లోకి వెళితే.. ఏదో ఒక కాంట్రోవర్సీ టాపిక్ పై స్పందించి వార్తల్లో ఉండాలని తపించే నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) అందరికీ సుపరిచితమే. ఆయన కుమార్తె నట్టి కరుణ ‘దెయ్యంతో సహజీవనం’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇంకో సినిమాలో ఆమె కనిపించలేదు. అయితే సడన్ గా ఆమె పెళ్లి చేసుకున్నట్టు తెలిపి అందరికీ షాకిచ్చింది. నిఖిల్ గూడిరి అనే ఫిట్నెస్ ట్రైనర్ కమ్ న్యూట్రీషియన్..ను కరుణ వివాహం చేసుకుందట.

ఇంకో షాకిచ్చే విషయం ఏంటంటే.. వీరి వివాహం జరిగి నెల రోజులు దాటిందట. పెళ్ళై మొదటి నెల పూర్తయిన నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తన అత్తమామలకు అలాగే తన తండ్రికి (Natti Kumar) ధన్యవాదాలు తెలుపుతూ ఆమె ఈ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆమె పెళ్ళికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

సినిమాగా రానున్న సమంత కొత్త వెబ్‌ సిరీస్‌… హీరో రియాక్షన్‌ ఇదే!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus