Dil Raju: రివ్యూ రైటర్లకి దిల్ రాజు బంపర్ ఆఫర్!

టాలీవుడ్లో రివ్యూ రైటర్లపై ఫిలిం మేకర్స్ కి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. ‘కంటెంట్ మంచిదా? కాదా?’ అని నిర్దారించేది రివ్యూలే అని అనడం పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు. సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్ ని.. సూటిగా వివరించి చెప్పడమే రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ సినిమా వాళ్ళు.. ‘రివ్యూల వల్లే సినిమాలు ఆడటం లేదు. ఇండస్ట్రీని రివ్యూలు నాశనం చేస్తున్నాయి.. సినిమా చచ్చిపోతుంది’ అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.

Dil Raju

చాలా సార్లు రివ్యూల వల్లే సినిమాలు భారీ సక్సెస్..లు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే రివ్యూ అనేది వ్యక్తిగత అభిప్రాయం అని అనుకుంటే.. కొందరు పాజిటివ్ గా ఇస్తారు, ఇంకొంతమంది నెగిటివ్ గా ఇస్తారు. అది వారి అభిప్రాయంగా తీసుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో రివ్యూ రైటర్స్ పై కొంతమంది దర్శక నిర్మాతలు నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

సరే.. అవి ఎప్పుడూ ఉండేవే..! కానీ రివ్యూ రైటర్లకి దిల్ రాజు (Dil Raju) ఓ సవాల్ విసిరారు. అదేంటంటే.. ఆయన కొత్తగా ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే సంస్థ‌ని స్టార్ట్ చేస్తున్నారట. ఇందులో కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అయితే ‘సినిమా చూసి హిట్టా.. ప్లాపా అని తేల్చి చెప్పే రివ్యూ రైటర్లు…

స్క్రిప్ట్ దశలో .. తప్పొప్పులను గుర్తించి స్క్రిప్ట్ ను మంచిగా రెడీ చేసి ఇవ్వండి. తద్వారా నేను మంచి సినిమా అందించడానికి వీలవుతుంది’ అంటూ ఆయన కోరారు. వాస్తవానికి ఇది మంచి ఆలోచనే. బడ్జెట్ భారం కాకుండా నిర్మాతలకి మేలు జరుగుతుంది.

అవును పడ్డాను.. ట్రోలర్స్ కు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus