వరుణ్ ధావన్ (Varun Dhawan) , సమంత (Samantha) ప్రధాన పాత్రల్లో ఇటీవల స్ట్రీమింగ్‌కి వచ్చిన వెబ్ సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ’. త్వరలో దీనిని మనం సినిమాగా చూడనున్నామా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఓటీటీలో వచ్చిన / వస్తున్న స్పందన నేపథ్యంలో వెబ్ సిరీస్‌లను సినిమాగా మార్చే ప్రయత్నాలు బాలీవుడ్‌లో ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్‌గా సినిమా రూపొందుతుండగా.. మరో సిరీస్ ఆ ప్లాన్‌లోకి వచ్చింది అని అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల ‘సిటడెల్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
నిడివి సమస్య కారణంగా కాస్త బోరింగ్‌గా అనిపించినా.. సిరీస్ మీద పెద్దగా నెగిటివ్ పాయింట్స్ లేవు. సమంత కోసం సిరీస్ చూసేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఈ క్రమంలో ‘సిటడెల్ 2’ గురించి చర్చ మొదలైంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో మాట్లాడుతూ సిరీస్ గురించి వరుణ్ ధావన్ ఆసక్తికర కామెంట్ చేశాడు. ప్రస్తుతం తాను వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని, ఇప్పట్లో ‘సిటడెల్ 2’ అంటే కష్టమే అని అన్నాడు.
అయితే ‘సిటడెల్: హనీ బన్నీ’ మేకర్స్ మాత్రం సిరీస్ పార్ట్ 2ను సినిమాగా తీసుకురావాలని ఆలోచిస్తున్నారని చెప్పాడు. త్వరలోనే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు అని కూడా చెప్పాడు. దీంతో ‘సిటడెల్’ను కూడా సిరీస్ చేసేస్తారు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ సినిమా రూపం దాలుస్తోంది. ‘మీర్జాపూర్ ది ఫిల్మ్’ పేరుతో సినిమాను సిద్ధం చేస్తున్నారు ఫర్హాన్ అక్తర్.
‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌ను సృష్టించిన పునీత్ కృష్ణనే దీనికీ కథ అందించారు. గుర్మీత్‌సింగ్ దర్శకత్వం వహించనున్నారు. రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభించి.. 2026లో సినిమాను విడుదల చేస్తామని ఫర్హాన్ ప్రకటించారు. 2018లో ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ తొలి సీజన్ విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘మీర్జాపూర్ 2’, ‘మీర్జాపూర్ 3’ కూడా వచ్చి విశేష ఆదరణ సంపాదించుకున్నాయి.