క్రిష్ తో పాటు రెండో వివాహం చేసుకున్న 12 మంది దర్శకుల లిస్ట్!

సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది ఫ్యామిలీ లైఫ్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయలేక విడాకులు తీసుకుంటున్న వార్తలు మనం రోజూ చదువుతూనే ఉన్నాం. అయితే ఈ లిస్టులో ఎక్కువగా హీరో, హీరోయిన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్..లు మాత్రమే ఉంటారు అని అనుకుంటాం. కానీ డైరెక్టర్లు (Directors) కూడా రెండో పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ డైరెక్టర్లు (Directors) ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

Directors

1) సీనియర్ ఎన్టీఆర్ :

దివంగత స్టార్ హీరో, ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు (Sr NTR) గారు దర్శకుడిగా కూడా మారి ‘సీతారామ కళ్యాణం’ ‘శ్రీకృష్ణ పాండవీయం’ ‘వరకట్నం’ వంటి సినిమాలు తీశారు. అయితే ఆయన మొదటి భార్య బసవతారకం మరణించాక లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

2) విజయ నిర్మల :

ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయ నిర్మల కూడా డైరెక్టర్ గా మారి ‘మీనా’ ‘బెజవాడ బెబ్బులి’ వంటి సినిమాలు తీశారు. ఇక మొదటి భర్తతో దూరమయ్యాక సూపర్ స్టార్ కృష్ణని (Krishna) ఈమె రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

3) కృష్ణ :

సూపర్ స్టార్ కృష్ణని అంతా డేరింగ్ అండ్ డాషింగ్ అంటుంటారు. ఆయన దర్శకుడిగా మారి ‘సింహాసనం’ ‘కొడుకు దిద్దిన కాపురం’ వంటి హిట్ సినిమాలు తీశారు. ఆయన ఇందిరా దేవి గారిని మొదటి వివాహం చేసుకున్నారు. తర్వాత విజయ నిర్మల గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

4) పవన్ కళ్యాణ్ :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శకుడిగా మారి ‘జానీ’ (Johnny) సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈయన తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ (Renu Desai) ని రెండో వివాహం చేసుకున్నారు. తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చి అన్నా లెజినోవా ని మూడో వివాహం చేసుకున్నారు.

5) సౌందర్య రజినీకాంత్ :

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కుమార్తె సౌందర్య (Soundarya Rajinikanth) ‘కొచ్చాడియన్’ (Kochadaiiyaan) ‘విఐపి 2’ (Velaiilla Pattadhari 2) వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఇక ఈమె కూడా మొదటి భర్త అశ్విన్ రామ్ కుమార్ కి విడాకులు ఇచ్చి.. విశాగన్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది.

6) భాగ్యరాజ్ :

తమిళంలో శోభన్ బాబు ఇమేజ్ కలిగిన భాగ్య రాజ్ (Bhagyaraj) .. దర్శకుడిగా ‘ఓరు కై ఊసై’ వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఇక వ్యక్తిగత జీవితంలో ఇతని మొదటి భార్య ప్రవీణ మరణించాక, పూర్ణిమ జయరామ్ ని రెండో వివాహం చేసుకున్నారు.

7) సెల్వ రాఘవన్ :

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్ (Selvaraghavan) ‘7/జి బృందావన కాలనీ’ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా పాపులర్ అయ్యారు. ఆయన మొదట సోనియా అగర్వాల్ ను (Sonia Agarwal) పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థలు రావడంతో విడిపోయారు. తర్వాత గీతాంజలి రామన్ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు.

8) బాలాజీ మోహన్ :

‘లవ్ ఫెయిల్యూర్’ (Love failure) దర్శకుడు బాలాజీ  (Balaji Mohan) కూడా అరుణ అనే అమ్మాయిని పెళ్లాడాడు. కానీ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయి.. ధన్య బాలకృష్ణన్ ని రెండో వివాహం చేసుకున్నాడు.

9) ఏ.ఎల్.విజయ్ :

తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ (A. L. Vijay) మొదట హీరోయిన్ అమలా పాల్ ని (Amala Paul) వివాహం చేసుకున్నారు. కానీ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయి ఐశ్వర్య అనే ఆమెను వివాహం చేసుకున్నాడు.

10) ప్రకాష్ రాజ్ :

స్టార్ నటుడు, నేషనల్ అవార్డు గ్రహీత అయినటువంటి ప్రకాష్ రాజ్ (Prakash Raj) కూడా ‘నాను నాన్న కనసు’ ‘ధోని’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఇతని వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే.. లలిత కుమారి అనే ఆమెను మొదటి వివాహం చేసుకుని.. తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. తర్వాత పోనీ వెర్మ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు.

11) కమల్ హాసన్ :

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కూడా హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి ‘అమరన్’ (Amaran)  వంటి సినిమాలు నిర్మించారు. ఇక దర్శకుడిగా మారి ‘విశ్వరూపం’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ఇక వ్యక్తిగత జీవితంలో వాణి గణపతిని మొదట వివాహం చేసుకున్న ఇతను.. తర్వాత సారిక ఠాకూర్ ను రెండో వివాహం చేసుకున్నారు. తర్వాత గౌతమితో కొన్నాళ్ళు సహజీవనం చేశారు.

12) క్రిష్ :

రమ్య వెలగ అనే అమ్మాయిని ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న క్రిష్  (Krish Jagarlamudi) తర్వాత ఆమెతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈరోజు ప్రీతి చల్లా అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.

యావరేజ్ టాక్ తో ‘పుష్ప 2’ ఆ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తుందా?

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus