అమీర్ ఖాన్ ను మిస్టర్ పర్ఫెక్ట్ అని ఊరికే అంటారా చెప్పండి. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమే కాక.. పాత్రకు అవసరం అనిపిస్తే ఎంత కష్టపడైనా తన శరీరాకృతిని పాత్రకు తగ్గట్లుగా తీర్చిదిద్దడంలోనూ అమీర్ ఖాన్ సిద్ధహస్తుడు. అలాంటి అమీర్ ఖాన్ కు కథ చెప్పి ఒప్పించడం అంటే కత్తి మీద సాము లాంటిది. బౌండెడ్ స్క్రిప్ట్ వర్క్ మాత్రమే కాదు స్టోరీ బోర్డ్ కూడా రెడీ చేసుకొని వెళ్ళినా కథలో లేక ఏ ఒక్క సన్నివేశంలోనో ఏదైనా ఎమోషన్ కి తాను కనెక్ట్ అవ్వకపోతే సింపుల్ గా నేను చేయలేను అని చెప్పేస్తాడు అమీర్ ఖాన్. అందుకే అమీర్ ఖాన్ చేత కథ ఒకే చేయించుకొన్న దర్శకుడికి బాలీవుడ్ దర్శకుల్లో ప్రత్యేక స్థానం లభిస్తుంది.
తాజాగా అమీర్ ఖాన్ మహేష్ మతాయి అనే దర్శకుడితో వ్యోమగామి రాకేష్ శర్మ జీవితం ఆధారంగా ఒక సినిమా సైన్ చేసిన విషయం తెలిసిందే. అంతరిక్షంలో అడుగిడిన మొట్టమొదటి భారతీయుడిగా పేరొందిన రాకేష్ శర్మ చరిత్రపుటల్లో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ప్రాముఖ్యత సంతరించుకొన్న వ్యక్తి జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తీయాలన్న ఆలోచన బానే ఉన్నప్పటికీ.. దర్శకుడు మహేష్ సరైన కథనం సిద్ధం చేసుకోకపోవడంతో అమీర్ ఖాన్ సారీ చెప్పి ప్రొజెక్ట్ నుంచి బయటకొచ్చేశాడట. అమీర్ ఖాన్ లాంటి పర్ఫెక్షనిస్ట్ కాదన్న కథను ఒకే చేసే సాహసం మరో హీరో చేయడు కాబట్టి ప్రస్తుతానికి రాకేష్ శర్మ బయోగ్రఫీ మూలనపడ్డట్లే.