భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?

ఓ సీరియల్ నటి పెళ్లి తర్వాత వేరే వ్యక్తితో ఎఫైర్ నడుపుతుందని ఆమె భర్త మీడియా ముందుకు వచ్చి పెద్ద షాకిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. (Atharintiki Daaredi) ‘అత్తారింటికి దారేది’, ‘పలుకే బంగారమాయే’ వంటి సీరియల్స్ తో పాపులర్ అయిన అడ్డాల ఐశ్వర్య పెళ్లి పేరుతో తనను మోసం చేసినట్లు ఆమె భర్త శ్యామ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతను ఇంకా మాట్లాడుతూ.. “పెళ్లికి ముందే వేరే వ్యక్తితో ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. మ్యాట్రిమోనియల్ ద్వారా పెద్దలు సంబంధం కుదర్చడంతో 2023 సెప్టెంబర్ 6న విశాఖపట్టణంలో ఐశ్వర్యతో నా పెళ్లి జరిగింది. అక్టోబర్ 7న హైదరాబాద్లో ఐశ్వర్య ఇంటికి వెళ్లాము, అయితే ఆ ఇంట్లో ఆమె స్నేహితుడు డ్రింక్ చేస్తూ కనిపించాడు. దీంతో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.ఆ తర్వాతి రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారి కరణం రమేతో ఐశ్వర్య ఉండటం చూసి షాక్ అయ్యాను.

దీంతో నిజం ఎక్కడ బయట పడిపోతుందో అని భావించి ఐశ్వర్య తల్లిదండ్రులు నన్ను బలవంతంగా విశాఖకి పంపేశారు. ఆ తర్వాత కరణం రమేష్ నాకు ఫోన్ చేసి ఐశ్వర్యకు విడాకులు ఇవ్వాలని, లేదంటే గొడవలు జరుగుతాయని హెచ్చరించాడు. విషయాన్ని ఐశ్వర్య తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళితే.. కట్నం కోసం తన కుటుంబం వేధిస్తున్నట్లు పెందుర్తి పోలీసుస్టేషన్లో తప్పుడు కేసు పెట్టారు.

ఐశ్వర్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తిరిగి నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాకు న్యాయం చేయాలని పోలీసులని, న్యాయస్థానాన్ని, మీడియాని కోరుతున్నాను” అంటూ శ్యామ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus